పుట:2015.373190.Athma-Charitramu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27. పరీక్షలు 117

వెంకటరావువంటివారల యజ్ఞాన నాస్తికత లెట్లు పాయునా యని నేను విచారించితిని.

ఆ రోజులలో నే నొకప్పుడు షికారు పోవుచుండఁగా, పెద్దాడ సాంబశివరావు నాకుఁ గానఁబడి, మీ పను లెట్లు సాగుచున్నవని యడిగెను. అంత మే మిరువురమును పోఁతగట్టుమీఁదికిఁ బోయి కూర్చుండి మాటాడుకొంటిమి. అదివఱ కతఁడు సంఘసంస్కరణ సమాజసభ్యుఁ డైనను, విగ్రహారాధన, జన్మాంతరము మొదలగువాని యందు విశ్వాసము గలిగియుండువాఁడు. పండిత శివనాథశాస్త్రి యిక్కడకు వచ్చి యుపన్యాసము లిచ్చుతరుణమునఁ దన సందియము లన్నియు నివారణ మయ్యె ననియును, తన కిపుడు ప్రార్థన సమాజసిద్ధాంతములందు నమ్మిక గలుగుచున్న దనియు నాతఁడు చెప్పెను. నా మాటలందు గౌరవము చూపిన యాతని మనస్సునకు నచ్చునట్టుగ నే నిట్లు పలికితిని : - "అన్ని సంస్కరణములకును ప్రార్థనయే మూలకందము. భగవంతుని నిష్కల్మష హృదయమున ప్రార్థించి, ఆయన యొసఁగిన జ్ఞానజ్యోతిసాహాయ్యమున మన విధుల నెఱవేర్పవలెను."

పిమ్మట నేను గంగరాజు గదిలోఁ బ్రవేశించితిని. శివనాథశాస్త్రి వీరేశలింగముగార్లను గుఱించి మేము చెప్పుకొంటిమి. ఈమధ్యనే వీరేశలింగముపంతులు శాస్త్రిగారితో మాటాడుచు, తన కేమి తటస్థించినను లెక్క సేయ నని పలికెనట ! పంతులచిత్తస్థైర్యమును నేను గొనియాడితిని. ఈఘను లిరువురు నిశ్చలభక్తిపరులు. కావుననే జనుఁ భూషణదూషణములను పాటింపక, తమ యుద్యమనిర్వహణమును వారు కొనసాగింపఁగలిగి రని నే జెప్పి, "మిత్రమా, మన జీవితావధి