పుట:2015.373190.Athma-Charitramu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. పరీక్షాపూర్వదినములు 115

నే నింటికి రాఁగానే తండ్రియుఁ దమ్ముఁడును నాతో వాదమునకు దిగి, శివనాధపండితుఁడు వట్టి జడుఁ డనియు మూర్ఖుఁ డనియును బలికి, నా కమిత హృదయవేదనమును గలిగించిరి.

17 వ తేదీని, ప్రాత:స్నానానంతరమున నేను కనకరాజు గంగరాజుగార్లతోఁ గూడి, వీరేశలింగముగారి యింటికి వెళ్లి, వారి మేడగదిలో నున్న శివనాధశాస్త్రిగారిని సందర్శించితిని. సంస్కరణముల ననుష్ఠానమునఁ బెట్టువిషయమున మే మాయన యాలోచన యడిగితిమి. శాస్త్రిగారు తన జీవితమును గుఱించి ప్రస్తావించిరి. దృఢసంకల్పుఁడగు తండ్రివలన తనకుఁ గలిగినయిక్కట్లు, విద్యార్థిదశ యందె తన యుపదేశానుసారముగ నొకవితంతువును బరిణయ మాడిన స్నేహితునికష్టములు, ఆతనికిఁ దోడ్పడుటయందుఁ దాను జూపిన స్వార్థత్యాగము, ప్రథమశాస్త్ర పరీక్షాదినము లందలి తన యధిక పరిశ్రమము, తన యుద్యమవిజయము, ఈశ్వరవిశ్వాసము, మున్నగు స్వవిషయములను శాస్త్రిగారు మాకుఁ బూసగ్రుచ్చినట్లు వినిపించిరి. అంత మాకోరికమీఁదఁ గొన్ని సదుపదేశము లాయన మాకుఁ జేసిరి.

ఆయన సెలవు గైకొని మే మిండ్లకు వెడలిపోయితిమి. అందఱము నమితానంద పరవశుల మైతిమి. నా జీవితమునం దెపుడు నింత సంతోష మనుభవింపలేదని నే ననుకొంటిని. నాగురువు, ప్రవక్త, మార్గదర్శియు శివనాథమహాశయుఁడే యని నేను విశ్వసించితిని. ఇంతకంటె నాకుఁ గావలసినయానంద మేది, భాగ్యవి శేష మేమి ?

అమితభావోద్రేకమున నాఁ డంతయు నే నేదో విచిత్రలోకమున నుండునట్లు తోఁచెను. శివనాథుని సుస్వరూపము నాకనుల యెదుట నృత్యము సలుపుచుండెను ! ఇట్టి మహాత్మునికిఁగల శీల