పుట:2015.373190.Athma-Charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుత రాయసం వేంకట శివుడుగా రాఱువేల నియోగిబ్రాహ్మణులు. తండ్రి సుబ్బారాయడుగారు, తల్లి సీతమ్మగారు. ప్రమోదూత సం. ఆషాడ బ. 10 (దశమి) శనివారము, కన్యాలగ్నమున, 1870 సంవత్సరము జూలయి 23 తేదిని వేలివెన్ను నందు జన్మించిరి. వీరి 6, 3 ఏండ్ల ఆత్మానుభవకథనము పాఠకులకు జీవయాత్రాసేవనమునం దుపచరింపగలదు. గ్రంథకర్త 652 పుటలందును విశదపఱచిన ఆత్మోదంత మాంధ్రావని యందును, హిందూస్థానమునందును, ప్రపంచమునందును సంప్రాప్తమగుచున్న భావక్రియా పరివర్తనమును సింహావలోకనము చేయుచు, ధీమంతులకు కర్తవ్యము నుపదేశించుచున్నది. గతించిన రెండు పురుషాంతరములందును నాంధ్రావనియందు సంప్రాప్తమైన సంస్కారాభ్యుదయమును వేంకటశివుడుగారి ఆత్మచరిత్రము సింహావలోకనము చేయుటకు వినియోగపడుచున్నది.

రాజమహేంద్రవర మాంగ్లసామ్రాజ్యస్థాపనానంతర మాంధ్రావనియం దారంభమునందు సాహిత్యవిజ్ఞాన సంస్కారవికాసమునకు కేంద్రస్థానముగ వెలసినది. ఆంగ్ల సంస్కారము ప్రాచీన భారతసంస్కారమును శిథిలము చేసినది. చిరకాలానుగతము లైన మతాచారములు, సాంఘికవ్యవస్థలు, సాహిత్యరచనలు, విద్యావిధానములు,