పుట:2015.373190.Athma-Charitramu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. పరీక్షాపూర్వదినములు 111

మహోత్సవము జరిగెను. ప్రాత:కాలమున ప్రార్థన జరిగెను. "ప్రార్థనయొక్క యావశ్యకత"ను గుఱించి వీరేశలింగముగారు మంచియుపన్యాసము చేసిరి. సాయంకాలము బహిరంగసభ జరిగెను. పరీక్షాధికారి నాగోజీరావు పంతులుగారు అధ్యక్షత వహించి, సద్భావమున పౌరుల యుపయోగార్ధమై కట్టించిన మందిరమునకు పంతులనభినందించిరి. యం. రంగాచార్యులవారు ఉపన్యాసము చేయుచు, వీరేశలింగముగారు చేసినభాషాసేవ నుగ్గడించుచు, ఆమహామహుఁడు జనుల నైతిక సాంఘిక పరిస్థితులయభ్యున్నతికొఱకై పరోపకారబుద్ధితోఁ గావించిన సత్కార్యముల నాయన ప్రశంసించెను. వాసుదేవశాస్త్రి గారి పద్యము లైనపిమ్మట కాల్పఁబడిన బాణసంచావెలుఁగున నూతన మందిరము సౌందర్యమునఁ జెలువారుచుండెను.

ఆరాత్రి నిద్రపోవుటకు ముందుగ, వీరేశలింగముగారికి కుడి బుజమై నిలిచి, త్యాగబుద్ధితోఁ గార్యసాధనము చేయు పాపయ్యగారినిగుఱించి నే నిట్లు తలపోసితిని : - "ఈపురుషుఁ డెట్టిసహృదయుఁడు, సచ్చారిత్రుఁడు ! తా నెపుడును వెనుకనే నిలిచి యుండఁ గోరెడి యీయన వినమ్రత యెంత శ్లాఘనీయము ! ఈయనకు నాకు నెంత యంతరము గలదు ! మహాగర్వి నైననే నీసత్పురుషుని గోటి నైనను పోలఁగలనా ?"

30 వ తేదీని వీథులలో నొక వింతసాటింపు వింటిని. దొండపూడికి వేలకొలది ప్రజలు వచ్చుచుండుటచేత అక్కడ విశూచి యంకురించె ననియు, జనులు రావల దనియు సర్కారువారు సాటింపు చేయించిరి. ఆగ్రామములో నొకవైద్యునిపే రీమధ్య పైకి వచ్చెను. ఆతఁడు జనుల రోగములను సులభముగ నివారణ చేయుచుండెనని ప్రతీతి గలిగెను. అందువలన నచటికి తండోప