పుట:2015.373190.Athma-Charitramu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 110

జేకొందు నని చెప్పెను. నాసంగతియు నేను బ్రస్తావించితిని - సంస్కరణోద్యమవిజయమునకై నేను జీవితము ధారవోయ నిశ్చయించితి ననియు, నాతో మనసుగలసి పనిచేసెడి నెయ్యునికొఱకు నేను వెదకుచుంటి ననియుఁ జెప్పితిని. అంత, గంగరాజు తను నట్టిచెలికానిగా నేను జేకొనవచ్చు ననియు, వలసినచో నాకుఁ దాను ధనసాహాయ్యమును జేయుచుందు ననియు నుడివెను. తాను బోషింపవలసిన సోదరాదు లెందఱో యున్నను, తాను జేపట్టిన యుద్యమమునకు సంపూర్ణ విజయము చేకూర్చితీరెద నని వక్కాణించెను. నామీఁద గంగరాజునకుఁ గల యనురాగమునకు నా కృతజ్ఞతను దెలిపి, రాఁబోవు వత్సరమున నేను వేఱింటికాఁపురము పెట్టినప్పుడు, నాకు సాయము చేయు వా రొకరైన నుండుటకు సంతసించితిని.

ఆమఱునాఁడు నేను కాంతయ్య కొండయ్యశాస్త్రి లక్ష్మీనారాయణగార్లును గలసి ముచ్చటించుకొనుచు, షికారుపోయితిమి. కాంతయ్యగారు వేదాంతోన్మాదమునకు లోనై నట్లు గానవచ్చెను ! శాస్త్రి లక్ష్మీనారాయణగార్లు మిత్రుఁడు వచించినదాని కెల్ల తాళము వైచుచు, యోగమహిమను గూర్చి తమసుముఖత్వమును దెలిపిరి ! ఆరాత్రి నే నిట్లు తలపోసితిని : - "నా మిత్రులజీవితమువలన మానవహృదయముయొక్క దౌర్బల్యచౌంచల్యములు నే నొకింత గ్రహించితిని. కొమ్మనుండి కొమ్మ కెగురుపక్షివలె నా హృదయము మతము నుండి మతమునకు గంతు లిడకుండును గాక ! నేను నిరతము ఆస్తిక బుద్ధి గలిగి, మానవసేవాతత్పరుఁడనై, వలసినచో నాయాశయములకై యసువుల నర్పింతును గాక !"

22 వ తేదీని వెంకటరావు కుటుంబముతోఁ గాఁపుర ముండుటకు రాజమంద్రి వచ్చెను. మఱునాఁడు రాజమంద్రి పురమందిరప్రవేశ