పుట:2015.373190.Athma-Charitramu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. ఏకాంతజీవితము 103

అయినను, నాకుఁ బ్రియమగు స్త్రీ స్వాతంత్ర్యము నాయన పరిహసించి, స్త్రీలను మఱింత బంధింపవలె నని చెప్పి, సంస్కరణనిరసనము చేసినపుడు నా కధికవిచారము గలిగెను. బంధువును, మిత్రుఁడును నగు కొండయ్యశాస్త్రియొక్క విపరీతపు ప్రాఁతమతాభిప్రాయముల నీతఁడు సమర్థించునటు లగఁబడెడివాఁడు! కాని, యీయన చిత్తవృత్తి యపు డేకవిధమున నుండెడిదికాదు. కేశవచంద్రసేనుల యాంగ్లేయోపన్యాసముల నత్యుత్సాహమున మా కీయన చదివి వినిపించి,ఉద్రేకము గలిగించుచుండెడివాఁడు. ఆకాలమున నా సహచరులలో నొకరగు శ్రీ ఆనూరి కాంతయ్యగారినిగూర్చి కొంత చెప్పవలెను. పూర్వము తానును సంస్కరణములయం దమితాభినివేశము గలిగియుండెడివాఁడ ననియు, కాని యావిషయమునఁ దా నిపుడు కాఁగి చల్లారిన పాలవలె తటస్థుఁడ నైతి ననియు, ఆయన పలుకుచుండెడివాఁడు. చాత్తాద వైష్ణవుఁ డయ్యును, ఆయన సామాన్య బ్రాహ్మణయువకులందుఁ బొడఁగట్టని పారిశుద్ధ్య మనోనిగ్రహములచే నొప్పెడివాఁడు. సాధువర్తన మితభాషిత్వము లాయన సొ మ్మగునటు లుండెడివి ! ఆసమయమున పట్టపరీక్ష రెండవశాఖకుఁ జదువుచు, తర్కమనశ్శాస్త్రములు అభిమానవిద్యగాఁ గైకొని, నీతిశాస్త్రమందలి మంచికథపట్టులు మాకు వినిపించుచుండెడివాఁడు. ఆ సంగతులు మిగుల చిత్తాకర్షకములుగ నుండి, పట్టపరీక్షకుఁ జదివినచో, ఆశాస్త్రపఠనమే చేయ నాకు సంకల్పము గలిగెను.

మా తలిదండ్రు లింకను రేలంగిలో నుండుటచేత, సోదరులు మువ్వురము రాజమంద్రిలో నొంటరిగ నుండి, మావంట మేమే చేసికొనుచువచ్చెడివారము. పెద్దవాఁడనగు నామీఁద సామాన్యముగ వంటపని పడుచువచ్చెను. ప్రొద్దున పదిగంటలకే మేము మువ్వురము వంట