పుట:2015.373190.Athma-Charitramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 100

చెడుగును గుఱించి వచించుట కాతఁడు వెనుదీయకుండుటయు, ఎందును తనప్రాముఖ్యముఁ దెలుపుచు మాటాడుటయు, నా కాతనిసంభాషణమునకు ముఖ్యచిహ్నములుగఁ దోఁచెను. అతిశయోక్తులతో నుపన్యసించుటయు నతని కభ్యాసము. సహచరునియలవాటు పట్టుపడి, అపుడపుడు సంభాషణమున నతిశయోక్తులు చొప్పింప నేనును వెఱువకుండెడి వాఁడను !

కళాశాల తీయు దినములు సమీపించుటచే నేను, తమ్ము లిద్దఱును రాజమంద్రి పయనము కావలసివచ్చెను. నేను వెంకటరావు నొద్ద వీడ్కోలు గొంటిని. మరల వానినిఁ గలసికొనకయె నేను మృత్యువువాతఁ బడినచో, నన్ను గుఱించియైన నాకుఁ బ్రియమగు సంస్కరణపక్ష మవలంబింపు మని వానినిఁ గోరితిని. 17 వ జూన్ మధ్యాహ్నమున తమ్ము లిద్దఱితో నేను బయలుదేఱితిని. రేలంగి యిల్లు 'మరమ్మతు' అగుచుండుటచేత, మా తలిదండ్రులు, చిన్నపిల్లలును మాతో రాలేకపోయిరి. మరల విద్యాశాలఁ జేరవలె ననెడి యాశ మమ్ము వేగిరపెట్టగ, వర్షములోనే మేము నడచిపోవ సమకట్టితిమి. రెండు పెద్దమూటలు మేము మోయవలసి వచ్చెను. దారిలో వాన హెచ్చినను రాత్రికి వేలివెన్ను చేరవలె ననెడియాశచే మేము బురదలోనే పయనము చేసితిమి. ఎట్టకేలకు కాల్ధరికాలువగట్టు చేరితిమి. కాలువ పూర్తిగఁ బ్రవహించుచుండెను. దాటుటకు బల్లకట్టు లేదు. ప్రవాహమును దాటింపుఁ డని ఆవలియొడ్డున బట్ట లుదుకుకొను వ్యవసాయదారులను వేడితిమి. వారు సాయపడక, చిన్న తమ్ముని పెద్దవార మిరువురము చేతులు పట్టుకొని నీట నడిపించినచో, కాలువ దాటవచ్చు నని యాలోచన చెప్పిరి. కాఱుమబ్బుచే నల్ల బడిన యాకాశము ప్రతిఫలించి యిపుడు భయంకరాకృతిఁ దాల్చిన కాలువనీట