పుట:2015.373190.Athma-Charitramu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24. కమలా మనోహరులు 95

ఆయువతీయువకు లెంతసేపు దు:ఖతోయములఁ దోఁగుచుండిరో తెలియదు. బాలసూర్యుని యరుణకిరణములు తన శోక తిమిరమును దొలఁగించినట్టుగఁదోచి, గమల కనులువిప్పి చూచునప్పటికి, మనోహర మెచ్చటను గానరాకుండెను !

సూర్యబింబము సువర్ణకాంతులతో వియత్పథమున వెలుఁగు చున్నను, కమల కన్నుల కాదివసము కాఱుమబ్బులు గ్రమ్మిన కేవల దుర్దిన మయ్యెను ! ఆసాయంకాలము చెలికత్తెలు శుభకార్యమున కనువగు నలంకారములు తనకుఁ జేయునపుడు, చుక్కల నడుమనుండు చందురునివలె కమల వారలమధ్యఁ గొమరారుచుండెను. అపుడె యింటి కేతెంచిన యెఱుకతచేఁ జేయిచూపించుకొనుమని యామెచెలులు పట్టు పట్టిరి. తమగతి తమ కెఱుకపడినవారి కెఱుకలు జోస్యములు నేల? ఐనను, నెచ్చెలుల కోరిక చొప్పున కమల చేయిచాచెను. కన్నులు కరమం దున్నను, ఎఱుకత కెపుడును, మనస్సు ముఖముననె దవిలీయుండును ! అది యిట్లు లోనఁ దలపోసెను: "ఈ శుభసమయమున సొబ గొందవలసిన యీసుందరి ముఖపద్మ మేల ముకుళించి యున్నది? ఎందుల కీ సోగకనులు సోలియున్నవి ? ఈమె హృదయము వ్యాకులితమై యుండవలెను. ఇది గుప్తముగ నే గనిపెట్టెదను !" ఐనను, కుతూహల లగు నా కోమలులఁ దనియింపఁబూని యెఱుకత, "ఈ ముద్దరాలి కడుపున పదిమంది పుత్రులు పుట్టెదరు." అని పలికి, చెలులందఱు సంతోషకోలాహలమున నుండునపుడు, నాఁటిరాత్రి యొకసారి తోఁటలోనికి రమ్మని కమలకు మెల్లగఁ జెప్పి వెడలిపోయెను.

పిమ్మట తోఁటలో నెఱుకత కమల కిట్లనెను: "నీచేయి చూచి సమయమున కేదో కల్ల బొల్లి కల్పించితినిగాని, నీమనసున