పుట:2015.373190.Athma-Charitramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ణము. స్వీయచరిత్రకథన మాత్మోద్ధరణమునకువలె పరోద్ధరణమునకును వినియోగపడుచున్నది. సత్యార్థ ప్రకాశమునకును, దురభిమాన దురహంకార నిరసనమునకును, ఆత్మచరిత్రలు కథకులకును, పాఠకులకును సాధనములుగ నున్నవి. విద్యావంతుల చరిత్రములును సత్పురుషుల చరిత్రములును ధర్మాత్ముల చరిత్రములును నధికతరముగ నుపయోగపడినను, సామాన్యులచరిత్రలును నాత్మోద్ధరణమున కుపయోగపడగలవు. శ్రీయుత రాయసం వేంకటశివుడుగా రాత్మచరిత్రారంభమునందు నంతమందును వారి యాత్మచరిత్రయొక్క ప్రయోజనము నిట్లు వ్యక్తముచేసిరి:

"గ్రంథకర్త యేపుస్తకము వ్రాసినను, అది యాతని యాత్మ చరిత్రమె యగునని యొక సుప్రసిద్ధ రచయిత నుడివెను. మన రచనములు అద్దములవలె మన యభిప్రాయములను ప్రతిఫలనము చేయుచుండును. మన కొంకిగీఁతలెల్ల మన జీవితకథనే గీయుచున్నను, ఎంతజాగ్రత్తతోఁ జిత్రించిన జీవితచరిత్రమునందును, కొంకర గీఁతలు గానిపించుచునే యుండును! ఇతర రచనములందుకంటె నాత్మకథాసంవిధానమున భ్రమప్రమాదముల తాఁకు డధికముగఁ గానవచ్చును. పరులరూపమును జిత్రించుపట్ల నెంతో నిపుణతచూపు మనవ్రేళ్లు, సొంత ప్రతిమను గీయునపుడు వణకఁజొచ్చును! అహంభావము, పక్షపాతబుద్ధి మున్నగు దుర్లక్షణములు మనల నావేశించి, సత్యపధమునుండి యొక్కొకసారి మనపాదములను పెడదారులఁ బట్టించుచుండును. ఐనను, రోటిలోఁ దల దూర్చినవాఁడు రోఁకటి