పుట:2015.373190.Athma-Charitramu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 86

ప్రార్థింపను." అని యొకప్పుడును మాతండ్రి పలుకుచుండువాఁడు ! ఆయనకుఁ గల యిట్టి పరస్పరవిరుద్ధభావములు చూచినపుడు ఆశ్చర్యమంది, ఆయన కీవిషయములందు కాపట్య మారోపించి నేను కొంత వఱకు సేదదేఱుచుందును !

దినదినమును మా తండ్రిచర్యల వైపరీత్య మతిశయించుచుండి నట్లు నాకుఁ గనఁబడెను. రేలంగిలో నొకనాఁటిరాత్రి మా పురోహితునితో మాటాడుచు, మాజనకుఁడు నన్నుఁ జూపించి, "మతమును గుఱించి చర్చ చేయుటకు మావాఁడు మిక్కిలి సమర్థుఁడు. మొన్న రాజమంద్రిలో వీడు వీనిస్నే హితులును ఒక స్వాములవారితో వేదములు మొదలగువాటినిగుఱించి చర్చ చేసి జయించిరి. దేవు డొక్కడే యనిన్ని, మనుష్యు లందరు సమాను లనిన్నీ మావాడు వాదింపగలడు" అని ఆయనతోఁ జెప్పివేసెను !

దీనినిఁబట్టి మాతండ్రి నాయభిప్రాయములను బాగుగ గుర్తెఱిఁగియె యుండె నని నేను స్పష్టపఱుచుకొంటిని.

ఇది జరిగిన కొలఁదిదినములకు నే నొకప్రొద్దున, "సంస్కరణావశ్యకత" ను గూర్చి తెలుఁగున నొకవ్యాసము వ్రాయుచుంటిని. అప్పుడప్పుడు నాదగ్గఱకు వచ్చి మాతండ్రి నావ్రాఁత కనిపెట్టు చుండెను. రాత్రి భోజనానంతరమున నేను జదువుకొనుచుండఁగా, ఆయన మాపురోహితుని మఱికొందఱిని వెంటఁబెట్టుకొని నాదగ్గఱకు వచ్చి, ప్రొద్దున వ్రాసినకాగితము చదువు మని నన్నుఁ గోరెను. "మా వాడు రాజమంద్రిలో ఒక మతసభకు కార్యదర్శి. జాతు లన్ని యు నొక్కటె యని యతనిమతము. మతవిషయములగుఱించి మీలో నెవరితోనైనను వీడు వాదించగలడు ! మావాడు యింగ్లీషున వేద