పుట:2015.373190.Athma-Charitramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22. జనకుని విచిత్ర చిత్తవృత్తులు 85

నెవఁడుగాని సంఘములో నిలిచియె తన యిచ్చవచ్చినట్టుగ నీశ్వరుని ధ్యానింపఁగూడదా ?" అని యాయన ప్రశ్నము. మా నాయన యెపుడు నిట్లు పూర్వాచారపరాయణతయె గనఁబఱచినను కొంత మేలే ! కాని, ఆయన స్థిరత్వము లేక, ఒకప్పు డొకవిధముగను, ఇంకొకసారి యింకొకరీతిని మాటాడుచుండువాఁడు. అందువలన నే నాయనను గపటి యని తలంచువాఁడను. దీనికిఁ దగినంత కారణము లేకపోలేదు.

1. "బ్రాహ్మణులు మహిమాన్వితులు, బ్రహ్మవర్చస్సున తేజరిల్లుమహానుభావులు. వారిని నిరసించి పరాభవించువారికి పుట్టగతులు లే"వని యొకమాఱును, "బ్రాహ్మణులు మ్రుచ్చులు ! వారిని గర్హింపవలెను" అని యింకొకమాఱును.

2. జాతినిగుఱించి మాటాడుచు, "అగ్రవర్ణమున నుండుటయె బ్రాహ్మణునిగౌరవము తెల్పుచున్నది. స్వజాత్యాభిమానము మన ముఖ్యధర్మము" అని యొకప్పుడును, "అన్నిజాతులు నొకటియె. భోజనసమయమున బ్రహ్మణేతరులను జూచుటకు బ్రాహ్మణులు సంకోచపడ నక్కఱలేదు. బొంబాయి ప్రాంతములందలి బ్రాహ్మణులు మనవలె దృష్టిదోషమును పాటింపరు." అని యొకప్పుడును

3. వేదములనుగూర్చి ప్రసంగించుచు, "వేదములు దేవదత్తములు. వేదాధ్యయనసంపన్నుఁడైన బ్రాహ్మణుఁడు దైవసమానుఁడు, పాముమంత్రమునకు దయ్యముమంత్రమునకును పటిమ యుండగా, వేదమంత్రములకు మహత్తు లేకుండునా ? విగ్రహములకు మహిమ లేక పోలేదు." అని యొకప్పుడును, "విగ్రహము లనిన నాకు తలనొప్పి, హృదయమే యీశ్వరాలయము. పూజల కని నేను బ్రాహ్మణులను