పుట:2015.373190.Athma-Charitramu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. జననీజనకులతోడి సంఘర్షణము 79

దీనిపర్యవసానము, సమాజమిత్రులు నన్ను 'సుబోధకు' డని పిలువసాగిరి ! రాజగురువు నన్ను 'పవిత్రగురువు' అని సంబోధించుచుండువాఁడు! హాస్యార్థమే వారు నా కిడినయీకితాబులకు నేను గులుకుచుండు వాఁడను ! అతిమితభాషి నని న న్నిదివఱకు గేలి చేసినబంధుమిత్రులు, వాచాలుఁడ నని న న్నిపుడు దిసంతులుగొట్టిరి ! సంస్కరణాభిలాషము మనసున కెంత హాయిగ నున్నను, ఒక్కొక్కప్పు డదియె నన్ను జిక్కులలో ముంచి, వ్యాకులతపాలు చేసెను. దీని కప్పటిసంగతులు రెండు ఉదాహరణములు లిచ్చుచున్నాను.

మా మేనత్తకుమారుడు మంత్రిరావు నరసయ్యగారు, తన పెద్దకుమార్తెను మాతమ్ముఁడు వెంకటరామయ్య కిచ్చి వివాహము చేయ నిశ్చయించుకొనిరి. దీనికి మా తలిదండ్రులు సమ్మతించిరి. నాకుమాత్ర మిది బొత్తిగ నిష్టము లేదు. నాయసమ్మతికిఁ గారణము నాసంస్కరణాభిమానమే గాని, వ్యక్తిగతమైన యాక్షేపణ మేదియుఁ గాదు. వథూవరు లిదివఱకె దగ్గఱబందుగులై బాల్యదశయం దుండుట నాయాక్షేపణమునకు విషయము. మార్చి 16 వ తేదీని యీసంగతిని గుఱించి మాతమ్మునితో మాటాడితిని. విద్యాస్వీకారము చేయుచుండెడి యాతఁడు నాయాలోచన విని, సంస్కరణపక్ష మవలంబించుట న్యాయ మని వక్కాణించితిని. నేను జెప్పినదాని కాతఁడు సమ్మతించెను గాని, తలిదండ్రులు పట్టుపట్టిన నేమిచేతు నని యడిగెను. విద్యాప్రాజ్ఞతలు గల వరుని కిష్టము లేని వివాహము జరుగ దనియె నేను జెప్పితిని. తన కెప్పటికిని పరిణయ మసమ్మత మని యతఁడు పలికినపుడు, విద్యాపరిపూర్తి యైన యౌవనసమయమున విద్యావతిని వివాహమాడుట తనవిధి యని యంటిని. సోదరున కిట్టిబోధన చేయుట యందుకాలుష్య మేకోశమందైన దాఁగొనియెనా యని నేను హృదయ