పుట:2015.373190.Athma-Charitramu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. సంఘసంస్కరణ సమాజము 77

పేరు పెట్టుకొనుటవలన ముందుగనే మనము జనుల యసూయాగ్రహముల కనవసరముగ గుఱి కావలసివచ్చును. మన సమాజసభ్యులలోఁ బలువురు విద్యార్థులే. కావున నట్టివారు మున్ముందుగనే తమ తలిదండ్రులద్వేషమున కాహుతియై తమ చదువునకు స్వస్తి చెప్పవలసి వచ్చును. కావున మనము సాధువులగు నామవేషములు దాల్చి శాంతముగఁ బనులు చక్కపెట్టుకొనుట శ్రేయము." అని యాయన యోజన చెప్పెను. రాజగురువున కీ 'రాజీ' సూత్రము రుచింపక, "అయ్యా, మన కీవిషయములందు సరళ ప్రవర్తనమే శ్రేయోదాయకము. గూఢవర్తనము ముమ్మాటికిని బనికిరాదు !" అని యతఁడు చెప్పివేసెను. నే నంత లేచి, "ఈసమస్యకుఁగల రెండు దృక్పథములును మన కిపుడు గోచరించినవి. అతివాదులకు సంఘసంస్కరణసమాజమనుపేరు నిలుపుకొనవలె ననియు, మితవాదుల కందు మార్పు చేసి కొనవలె ననియు సంకల్పము. మన మిది పర్యాలోచింపవలెను. పేరు నందు మార్పు అగత్యమా ? ఉన్న పేరు తీసివేసి యింకొకటి గైకొని నంత మాత్రమున, విధాన మేమియు మారదుగదా ? కావున బొత్తిగ నంధప్రాయులు కానిచో, ఏదేని యొక సంస్థను జనులు దానిపేరునుబట్టి గాక, దాని గుణకర్మలనుబట్టియే విమర్శింతురు. కావున ప్రస్తుతనామము ప్రజల యాగ్రహమును బురికొల్పు ననుమాట వట్టిది. * * *" అని ప్రసంగించితిని.

అపుడు స్థాపితమైన మాసంఘసంస్కరణసమాజము వారము వారమును బాలికాపాఠశాలలోఁ గూడెడిది. ఆభవనమునందే ప్రార్థనసమాజసభయును ప్రతివారము జరుగుచుండెడిది. రెండు సమాజముల సభ్యులు సామాన్యముగ నొక్కరే యగుటచేత, ఒకరిచర్యల కొకరు బాధ్యత వహింపవలసివచ్చెడిది. ఇపు డీ ప్రార్థనసమాజకార్యక్రమ