పుట:2015.373190.Athma-Charitramu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 74

సంస్కరణోద్యమమును కార్యాచరణమునకుఁ గొనివచ్చుటనుగూర్చి ముచ్చటించితిమి. మా మువ్వురిలోను గృహస్థాశ్రమానుభవము గలవాఁడు కనకరా జొక్కఁడే. విద్యాగంథ మెఱుఁగని భార్యయు, పూర్వాచారపరాయణ యగు పినతల్లి యు, తన సంస్కరణనిరతికి విముఖలై తనకు గుదిబండలుగ నున్నా రని యాతనిమొఱ ! జనాభిప్రాయభీతిచే నామిత్రునిమనస్సు మిగుల తల్ల డిల్లుచుండెను.

ఆతని యూహలలోఁగల సత్యము మాకును నచ్చెను. బ్రాహ్మమతస్వీకారఫలితముగ హిందూసంఘమును పూర్తిగా త్యజించుటకుఁ బూర్వము, స్నేహితుల మందఱము నొకకూటముగ నేర్పడి, యేతన్మత గ్రంథములను జదివి, చిత్తబలిమిని సంపాదించుచుండుట కర్తవ్య మని మాకుఁ దోఁచెను. ఇంతలో మా స్నేహబృందమునఁ గొన్నిమార్పులు గలిగెను. వెంకటరావు చదువు మానుకొని, ఆరోగ్యాన్వేషణమునకై స్వగ్రామమునకు వెడలిపోయెను. 12 వ తేదీని కనకరాజు నాతో మాటాడుచు, మాకళాశాలలో పట్టపరీక్ష మొదటితరగతిలోఁ జదువు నొక యోఢ్రయువకుఁడు తనతీవ్రసంస్కారాపేక్షచే సంఘబహిష్కృతుఁ డయ్యె ననువార్త చెప్పెను. మా కిపుడు కావలసినదే యిట్టివారల సావాసము ! నాఁటిసాయంకాలమే గంగరాజు కనకరాజు నేనును, రాజగురు వనుపేరుగల యావిద్యార్థిని గలసికొని, మతసాంఘికవిషయములను గుఱించి మాటాడుకొంటిమి. నాఁడే వీరేశలింగముగారి యింటికిఁ బోయి, సంస్కరణోద్యమమును గుఱించి వారితో రాత్రి యెనిమిదిగంటలవఱకును చర్చ సలిపితిమి. విద్యాపరిపూర్తియై స్వతంత్రుల మైనపిమ్మట, మేము జాతిభేదములను త్యజించి యభీష్టమార్గ మవలంబింపవచ్చు ననియు, ఈమధ్యగ మే మందఱము