పుట:2015.373190.Athma-Charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. నూతనదృక్పథము 71

రావుతో మాటాడునప్పుడు, ఇట్టి జీవితచరిత్రములలో సత్యము ప్రథాన మని తలంచితినిగదా. ఈ చరిత్రకారుఁడు లోఁతుచొరని వికటకవి యని నా యప్పటితలంపు. దైవసహాయ మున్నచో, వీరేశలింగముగారి జీవితచరిత్రమును మెకాలెవలె సంగ్రహవ్యాసరూపమున నేను రచింప నుద్దేశించితిని. నాయాశ్చర్య మే మని చెప్పను ? ఆమఱుసటిదినమే కాంతయ్యగారిని నేను గలసికొనినప్పుడు, పంతులుగారికిని, గౌరరాజు లక్ష్మీనరసింహముగార్లకును గలభేదములనుగూర్చి యాయన నాతో ముచ్చటించెను. వీరిలోఁ గడపటివారు మొదట వితంతూద్వాహపక్షపువా రయ్యును, పంతులుగారియెడ మనస్పర్థ లూని తనపేరునకుఁ గళంకము తెచ్చుకొనె నని చెప్పెను. పంతులుగారి శీలమునఁగల కొఱంతలును కొన్ని యాయన సూచించెను.

మతవిశ్వాసములందు నా కిపుడు కొంత స్థిరత్వము గలిగినను, హిందూసంఘమున నల్లి బిల్లిగ నల్లుకొని, జనులయభ్యుదయ మరికట్టెడి దురాచారప్రాబల్యము కనిపెట్టినపు డెల్ల నాడెందమున నాగ్రహ ముప్పొంగెడిది ! పూర్వాచారపరాయణత్వము నా ప్రబలవిరోధి యని పరిగణించువాఁడను. ఆజనవరి 3 వ తేదీని, మాతల్లి వలదని ఘోషించుచుండినను, నా చెవిపోగులు తీయించివైచి, దిగ్విజయము చేసితి ననుకొంటిని ! ఆమార్చి 21 వ తేది సంవత్సరాదిపండుగనాఁడు, అభ్యంగనము మానివైచి, పూర్వాచారధిక్కారము చేసితినని యుప్పొంగితిని ! ప్రాఁతనేస్తుల సావాసము నా కిపుడును ప్రియమయ్యును, వారిలో పూర్వాచారాపరాయణులగు కొండయ్యశాస్త్రి వంటివారిమీఁద కొంత "మోజు" తగ్గెను. వెంకటరావు నా కాంతరంగికమిత్రుఁ డయ్యెను. మతవిశ్వాసములందు భిన్నాభిప్రాయుఁ డయ్యును. సంఘదురాచారనిరసనమున నా కాతఁడు పరిపూర్ణసాను