పుట:2015.373190.Athma-Charitramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 66

దుర్దినము ! హృదయశల్యమగు నిట్టి కష్ట మాపాదించిన యీ నికృష్టదినము నా కెన్నటికైన మఱపువచ్చునా ?

"విపత్తు సంభవించిన నాఁటిరాత్రియె నా యాంతరంగికమిత్రమగు నీదినచర్యపుస్తకమునకు నామనోవేదనను వినిపించుచున్నాఁడను. నేను సంతాపనిమగ్నుఁడనైయున్నాను. దు:ఖాతిరేకముననే నాహృదయము మొద్దుపాఱియున్నది. నే నెవరినో నాకుఁ దెలియదు ! నేఁడు మధ్యాహ్నము మాకు సంభవించిన కష్టమున కర్థము గ్రహింపనేరకున్నాను. చెల్లెలి చావనఁగ నేమి ? నాకన్నులు పొడివాఱిపోయినవి. ఇందువలన నాహృదయము దు:ఖార్ద్రము గా దనుకొనకుమీ ! గాఢ సంతాపాసలమె నానయనముల తేమ నార్చివైచినది ! కాన, నాగుండియ రాతిగుండె యైపోయినది.

"ముద్దులచెలియలా ! నీ వెచటి కేగితివి ? జ్ఞానప్రసారకములగు నీకనుగలువలు, నీవిశాలవదనకమలము, నీసుకుమారశరీరకోరకమును - ఆహా, ఐదునెలలనుండి నిను వేఁచినవ్యాధివలన నెట్లు కమలిపోయినవి ! ఇప్పటికి నీవెతలు పరిసమాప్తి నొందినవి. ఆహా ! చిరంజీవిని వైన నీ వెంతటికీర్తి గడించియుందువోగదా ! అయ్యో, ఇది యెంత రిత్తకోరిక !

"నశరీరులైన మానవులకు అశరీరులగు జీవులతోఁ బ్రస్తావింప సాధ్య మయ్యెనేని, ప్రియసోదరీ, ఈతరుణమున నిన్నొకింత ప్రశ్నింపఁ గాంక్షించుచున్నాఁడను. అతిబాల్యముననె ప్రేమాతిరేకమున నీవు నన్ను 'అన్నా' యని పిలిచెడిదానవు. చెల్లీ ! దు:ఖభూయిష్ఠమగు నీభూలోకమున నీ వేల యావిర్భవించితివి ? నీ విపుడు మృత్యువువాతఁబడి మటుమాయ మైపోయితివిగదా. విఫల మనోరథుఁడనగు