పుట:2015.373190.Athma-Charitramu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

17. సోదరీనిర్యాణము 65

యైన యాబాలిక కమలిపోయెను. బాలికకు మృత్యు వాసన్న మయ్యెననియె గాక, దాని యపారవేదన కొకింతయైన నుపశమనము గావింప నేరకుంటి మనియు మేము దుర్భర మనోవ్యధకు లోనైతిమి.

మెల్లగ లేఁజివురు వెట్టుచుండు నాయాత్మ కీసందర్భమునఁ గలిగిన కఠినశోధనమునుగూర్చి యొకింత ప్రస్తావించెదను. ఆగస్టు 14 వ తేదీని నాదినచర్యపుస్తకమున లిఖితమైనవాక్యము లిచట నుల్లేఖించుచున్నాను : -

"నేఁడు మధ్యాహ్నము నేను కళాశాలనుండి యింటికి వచ్చునప్పటికి, ఇంట నెవరును లేకుండిరి. మాసొంతపెరటిలోనికిఁ బోయి చూడఁగా, అతిఘోరదృశ్యము నాకుఁ గానవచ్చెను. చనిపోవుచుండు మాకడగొట్టుచెల్లెలిచుట్టును మాతల్లి తమ్ములు చెల్లెండ్రును జేరి విలపించుచుండిరి. శుష్కించిపోయిన యాబాలిక శరీరమునుండి చిన్నదీపకళికవలె ప్రాణము రెపరెప మని యారిపోవుచుండెను ! ఆ కళేబరమునుండి యుచ్ఛ్వాస మొకటిరెండుసారులు వింటిమి. తుదిమరణవేదన ననుభవించి, ఆశ్రుపూరితములగు మాకనులయెదుటనె యా చిన్నిప్రాణ మంత నస్తమించెను.

"దు:ఖ మేమియో యెఱుంగని మా చిన్ని తమ్ముడు సూర్యనారాయణ, మే మందఱము విలపించునంతసేపును దూరమున నూరకు చూచుచుండి, శవము గొనిపోఁబడునపుడు అకస్మాత్తుగ నేడువసాగెను !

"ఇపుడు మృత్యువునోటఁ బడిన మాముద్దుచెలియలు సరిగా నొకవత్సరమె యీభూలోకజీవిత మనుభవించెను.

"కుటుంబమున తలిదండ్రులకును గొమరితకును, అన్న యక్కలకును జెల్లెలికిని, ఎడఁబాటు కలిపించిన యీదిన మెంతటికఠిన