పుట:2015.373190.Athma-Charitramu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 64

ముద్దుపేళ్లకును, ఉల్లాసము గలుగునట్టుగ వారితో నేను భాషించెడి చిన్ని పలుకులకును, మితి లేకుండెను. కావుననే నాయెడల వారలుకును, మించిన ప్రేమానురాగము లుండెడివి.

1888 వ సంవత్సరము ఆగష్టు 24 వ తేదీని జన్మించిన మాచిన్ని చెలియలు లక్ష్మమ్మ అను వెంకటరత్నమ్మ నాకు బహి:ప్రాణమె ! చామనచాయమేనితో నొప్పి, బక్కపలుచనియాకారము గల యాబాలిక, శైశవముననే తనసోగకనులతో ననుఁ జూచుచు, తన నెత్తికొనుమని నామీఁదికి వాలుచుండును. నాకుఁ జేత నెంతపని యుండినను, చెల్లెలిని దీసి యాడించుచుందును. తనతో నే నాడెడి ముద్దుపల్కులయర్థము తాను గ్రహించినట్టుగనే, ఆశిశువు, మృదుమంద హాసము చేయుచు, తనచిన్నిచేతులతో నామొగము నిమురుచుండును. దానికి నాకును భాష నపేక్షింపని వింతప్రేమ మమరియుండెను. దూరమున నామాట వినఁబడఁగనే యాబాలికి, తనమో మెత్తి, నన్నుఁ జూచి, నాముద్దులు గైకొనుట కాయత్తపడుచుండును !

1889 వ సంవత్సరము వేసవికాలమునకుఁ బూర్వమె దాని శరీరమున విషవ్యాధి యంకురితమయ్యెను. చూచుచుండఁగనే శిశువు కృశించి, మూలుగ నారంభించెను. నే నిలు సేరి యెదుట నిలిచినపుడు, నన్నుఁ దన నిడుద కనులెత్తి చూచి, తన నెత్తుకొమ్మని చేతులు నాదెసఁ జాచుచుండును. తా నమితవేదనకు లోనయ్యును, నాచేతుల నుండు నించుకసేపును హాయిగ నుండునట్లు కానఁబడు చుండును.

ఏమందులు నెట్టిచికిత్సలును ఆశిశువుపట్ల నిష్ప్రయోజనము లయ్యెను. వేసవివడ సోఁకిన చిగురుటాకువలె ననివారిత వ్యాధిపీడిత