పుట:2015.372978.Andhra-Kavithva.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఆంధ్ర కవిత్వచరిత్రము

ద్వితీయ


షణము క్తవస్తువు లేనిదీ కవి శూన్యము నుండి రసమును సృష్టింప లేఁడు.

రసికుఁడు నిమిత్తమాత్రుడు.

రసికుడు వస్తువులయం దంతర్గర్బిత మై నిబిడ మైయున్న విశేషణము సొస్వాదించి రసమునకుఁ గారణభూతుఁ డగును, ఎట్లన, భూభారమును మాన్పుటకు శ్రీకృష్ణుఁ డవతరించి యుండ, జనుల ప్రాణములు దీయుటకు మృత్యు దేవత ప్రతి క్షణసన్నిహితయై యుండ, శివుఁడు త్రిశూల పాణియై మూఁడవ కన్ను విప్పుకొని మహాప్రళయమును వ్యాపింపఁ జేయుటకు సంసిద్ధుఁడై యుండ, బ్రహప్రళయానంతరము పునస్సృష్టిఁ గావిం చుటకై ప్రయత్నముల సుపాయములను నాలోచించుచుండ, సర్జునుఁడు గాండీవమండిత హస్తుండై రణరంగమున నిమిత్త మాత్రుఁడై ప్రత్యక్షముగ గాండీవనిర్ముక్త ప్రచండనారాచముల శత్రుసంహారము గావించినయట్లు నరివర్గముల ప్రాణ ములను దీసిన దర్జునుఁడు గాఁడు. పై నఁ "బేర్కొనఁబడిన మహా శక్తులే. అర్జునుఁడు నిమిత్తమాత్రుడే. నిమిత్తమాత్రుఁడనుటలోనే యర్జునుని తాత్కాలిక ప్రయోజనము స్థిరపడుచున్నది. అర్జునుఁడు ప్రత్యక్షముగ నిమిత్తమాత్రుఁడైనను శత్రు సంహా రము గావించెనని గోచరింపక మానదు. సూక్తమగ సేనఁ జంపిన మహాశక్తి యర్జునుఁడు గాఁడని తేలునుగాక! అట్లే కవియు నిమి త్తమాత్రుఁడే, వస్తువునందు లేని రసవి శేషణమును కవి సృష్టింపఁజాలఁడు. వస్తువునందంతర్గర్బితమై తనకుఁ దక్క సన్యులకు గోచరింపనిదగు రసవి శేషణమును గవి "మొట్టమొదట సనుభవించి యితరులకు వ్య 'క్తముఁ జేయును. కవి పరమాత్మ చే