పుట:2015.372978.Andhra-Kavithva.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్,

77


తద్భావమును సువ్వ క్తముఁగావించుచున్నది. వాక్శక్తికి మహా శక్తియని మనమహర్షులు భావించి తచ్ఛక్తికి వాగ్గేవీ యను. నామము నిడిరి. వాగ్గేవీపదనగహ్వరాంతరమునుండి యనంత ముఖములతో నఖండ తేజ!పూరంబుతో నప్రతిమాన ప్రతిభా విభవముతో, దుర్నిరీక్ష్యశక్తితో వెల్వడి వచ్చుపదమే వాక్య. మనందగును. కావున “వాక్యమ్' అనుపదము కావ్యము నాథ్యాత్మిక ప్రపంచమును సధ్యాత్మిక శక్తిని బ్రదర్శించు ప్రయోజన కారి యని సూచించుచున్నది.

2. రసము కావ్యమున కాత్మ యగును.

ఇక 'రసాత్మకమ్' అనుపదౌచిత్యమును బరిశీలింతము. కావ్యమున కాత్మ నీతి - ధర్మ- మత, వేదాంతములు మొదలగు. శాస్త్రములు కావనియు, మానవ ప్రకృతి నవలీలగ వశముఁ గావించు కొని బంతియుంబోలె పల్లవములు గుసుమములను నాడించు బాలపవనునింబోలె నాడించు గల రసమే యనియు సూచితమగుచున్న ది. ఇంతియ కాదు. రసము కావ్యమున "కొత్త యనుటలో నింకొకవి శేషార్థము స్ఫురించుచున్నది. అదేదన, . రసము కావ్య జీవ మనందగు విషయమునకే వర్తించునుగాని కల్పతములును, మార్పునకు లోనగునట్టినియు నగు కావ్యము యొక్క బహిరింద్రియము లనఁదగు భాషామర్యాదలవిషయ మున వర్తింపదని సూచిత మగుచున్నది. అందువలనఁ గావ్య బహిరింద్రియ వ్యాపారముల నిర్ణయించి శాసింపనెంచు శాస్త్ర ములఁ బ్రభుత్వమునకుఁ గొంచెముగ 'నడ్డు దవిలి కావ్యము రసజీవియై రసాత్మకమై యనన్యపరతంత్రమై ప్రభవిల్లుటకుం