పుట:2015.372978.Andhra-Kavithva.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


వ్యక్తముఁ జేయు ననునాశకు నెడముఁ గల్గుచున్నది. కావున నింతదీర్ఘ చర్చఁ జేసి తేల్చినసారాంశ మేమనఁగా:

మమ్మటుని నిర్వచనమును,విశ్వనాథుని రసాత్మకంవాక్య'మ్మను సూత్రమును నాదరణీయములు.

మమ్మటుఁడు వచించినట్లు కావ్యము నియతికృత నియమ రహితాం , హ్లాదై కమయీ మనన్యపరతంత్రాం, నవరసముచిరాం, అనువర్ణ నమునకు సరివచ్చుననియే యిప్పటికిని మామతము. ఏల నన, సౌఖ్యాత్మిక కావ్యదృష్టి,యనవసర నియమ రాహిత్యమును, ననన్యపరతంత్ర తయును,హ్లాదైకమయతను, రసముచిరత్వమును జుల్కనగాఁ జూచుట లేదు. వాటినెల్లను సాధనములుగ నుప యోగించి యతీత శోభాయుతమును నాధ్యాత్మికశక్తియుత మును నగుకావ్య రూపమునఁ బరిణమింపఁ జేయును. మమ్మటుని కావ్య లక్షణమునకు, నాధ్యాత్మిక కావ్యలక్షణమునకును విరోధ మేమియు లేనిచో విశ్వనాథుని 'రసాత్మకం వాక్యం కావ్యమ్' అనులక్షణమునకు మాత్ర, మేల విరుద్దభావము పొసఁగును? పొసఁగదని నావిజ్ఞప్తి. ఎట్లన రసమునకును, నాధ్యాత్మికళక్తి కిని స్నేహమేకాని విరోధము లేదు. కావున రసాత్మకమగు వాక్య మాధ్యాత్మికళ క్తితో విరోధమునకుఁ బాల్పడదు. ఇట “రసాత్మకం వాక్యం కావ్యమ్' అనునిర్వచనము యొక్క ప్రాతిపది కౌచిత్యమును గమనింపఁ బ్రార్థితులు.

"రసాత్మకం వాక్యం కావ్య” మ్మనుసూత్రముయొక్క ఆ ప్రాతిపది కౌచిత్యము. 1. వాక్యమ్మన వాక్శకియె.

మొట్ట మొదలుగ 'వాక్యమ్' అనుపదము వైదిక ద్రష్ట లుపయోగించిన వాగ్గేవీ 'యను పదమునకుఁ బర్యాయముగనుండి