పుట:2015.372978.Andhra-Kavithva.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

63


సిగో త్తేజముఁ గలించును. కాని మతమునను సన్ని విధులను బ్రతిబంధక మాత్రముగ నుండిన మతముపట్ల జనుల కాదరము సన్నగిల్లు ననుభయమున మతకర్తలు పండువులు, వ్రతములు, నోములు మొదలగు సామాన్యజనోపయోగకర ములును, సామాన్య జనాంగీకృతములును నగు పద్ధతుల నేర్ప జచి మతమును గొంచెము రసవంతముగను; నాకర్షణశక్తిమంత ముగను జేయనెంచిరి. కవికి మతమునకు సంబంధించిన వివాద ములును, గర్మలును, సిద్ధాంతములును, వర్ణనయోగ్యములు గావు.

కవి మతవిషయములలో రసవత్తరములగు - వానినే సంగ్రహించును. కావున మతము కావ్యమునకు సాధనమాత్ర మే యగును.

మతమున నుండు మనోరంజకవిషయములను మాత్రమే కవి సంగ్రహించి స్వీయ పద్ధతి ననుసరించి కావ్యమున వర్ణింపఁ జూచును. కావున మతవిషయము "కావ్యమున నుపొంగము గను సాధన మాత్రముగను నుండఁదగునని నాయాశయము, కావ్యముల కుపయోగించునది మతమునందలి యాచార వ్యవహారములు గాక జనసమ్మతములగు విషయములే యనితెలిసికొనఁదగు. కావ్యమునకును మతమునకును బలవద్విరోధముమాత్రము లేదు. అనేక సమయముల గొప్పగొప్పకవులు మతాభిమానమును రసమును సమన్వయము చేసి చక్కని కావ్య ములను వ్రాసియుండుటయే యిందులకు నీదర్శనము. భక్తిగీతముల రక్తి మొలవఁ బాడిన తుకారాం, రామదాస్, చండీదాస్, కబీరు మొదలగు భక్తు లెల్లరును సకలకావ్య లోకవంద్యులు,