పుట:2015.372978.Andhra-Kavithva.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విషయసూచిక.

ప్రథమప్రకరణము

రసాత్మకం వాక్యం కావ్యమ్. ద్వివిధములగు కావ్యలక్షణములు - లాక్షణికమతము - లాక్షణికమతమున కాక్షేపము - శాస్త్రాదేశము రసప్రవృత్తిని బంధింపఁజాలదు - శాస్త్రాదేశము మహామహుల బంధింపఁజూలదు రసికమతము - రసస్వరూపరహస్యము - లోపరాహిత్యము రసవిషయమున నరుదు - సహజసౌందర్యమే యెక్కువభావోద్దీపకము - లాక్షణికరసికమతములకుఁ గలభేదము - కావ్యము సృష్టియేనా?—కవిబ్రహ్మ—కావ్యనిర్మాత—కావ్యకారుఁడు, రాజశేఖరకవిరాజుమతము - సహజ, ఆహార్య (పండిత), ఔషదేశిక (ఉపాసక) కవులు - సహజ ఆహార్యకవులు - కావ్యసృష్టికినీ, బాహ్యసృష్టికిని గలసంబంధము - కావ్యము బాహ్యసృష్టి కనుకరణమగునా? లేక స్వతంత్ర జీవియగునా? భిన్నమతములు-1. ప్లేటో, 2. అరిస్టాటిల్. 3. లాభైనీస్ - కావ్యము స్వతంత్ర సృష్టియేకాని, యనుకరణము కాదు - కావ్యసృష్టికిని బాహ్యసృష్టికిని సూత్రాత్మలయందు భేదము లేదు - అనుకరణ సృష్టివాదములయొక్క భిన్నపరిణామము - రోమను వాజ్మయస్వభావము - విప్లవములకు నవతారములకును గలప్రయోజనములు. విజ్ఞానోజ్జృంభణయుగము - ఛాసర్, షేక్స్పియగుకవులు లాక్షణిక కవిత్వము - పరాసువిప్లవము - మాత్యూఆర్నాల్డు - ఆధునికాంగ్ల కావ్యపద్ధతి - కవి నిరంకుశుఁడా? - శాస్త్రశృంఖలా విచ్ఛేదము - వ్యాకరణశాస్త్రము - వ్యాకరణశాస్త్ర ప్రయోజనము - వ్యాకరణము స్వాభావిక, శాస్త్రైకము లనిద్వివిధము