పుట:2015.372978.Andhra-Kavithva.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


రూపముగ గాక రమణీయమగు నాలంబముగఁ బ్రదర్శింప గలుగును. కావున వేదాంతికిని కవికిని నిరీక్షణ మొకటియే యని యొప్పుకొందమన్న ను సాధనములును, మార్గములును 'రెంటికిని 'భేదించును,

మతమునకును, కావ్యమునకును గలసంబంధము. 1. మతము కావ్యమునకు వలయు విషయసామగ్రిని - సేకరించి యిచ్చును. 2. కానీ మతమునకు సమష్టి మానవశ్రేయమే లక్ష్యము; కావ్యమున వ్యక్తి యొక్క రస ప్రవృత్తియే లక్ష్యము,

ఇఁక మతమునకును గావ్యమునకును గలసంబంధ మొక్కింత యరయుదము. కావ్యమునకుఁ గావలసినవిషయము లను మతవిషయిక గ్రంథములు సమకూర్చుననుట యేల్లరకును దెలిసినవిషయమే. మతగురువులయద్భుతచరిత్రములును, బండుగులకు సంబంధించిన కథలును, వ్రతములు నోములు మొదలగు వానికి సంబంధించిన కథలును గావ్య విషయము లగుననుట నిశ్చయమే. అయినను గావ్యమునకును మతమునకును నిరీక్షణ మున భేదము గలదు. మతము జీవితమున సామరస్యము నెల కొల్పుటకును, బరతత్త్వజ్ఞానము కరతలామలక మగుటకు వలసిన నిష్ఠను విధించుటకొరకును నేర్పడినది. అందుచే సమష్టి మానవ శ్రేయమే మతమునకుఁ బ్ర ధాసనిరీక్షణము. కావ్య మునకన్న నో వ్యక్తియొక్క స్వాతంత్ర్యమును, రసప్రవృత్తి యును బ్రధాననిరీక్షణములు. మతము విధుల ననుష్ఠించుట వలన జనులు జ్ఞానలబ్ధికిఁ దగియుందురని చూపును. కావ్యము రాగాధిక్యముచే, రసప్రవృద్ధి చే, భావతైక్ష్ణ్యముచే మాన