పుట:2015.372978.Andhra-Kavithva.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసాత్మకం వాక్యం కావ్యమ్.

61


చేయనిది కావ్యము నీతిబాహ్యమో కాదో యనునంశము నిర్ధారణఁగావించుట యెంతయుఁ గష్ట కార్యము. నీతివిషయిక ప్రశంసం గావించుట ముండ్లపొదను గదలించుటం బోలిన దే! కావున "కావ్యమున నీతి ధ్వనిమాత్రముగ నున్నఁ జాలునని సమయముదక్క నన్యనియమముల నేర్పఱచుట వ్యవహారలక్షణము గాదు. ఏలననఁ దీరనిచిక్కులు కల్గును.

కావ్యమునకును, వేదాంతమునకునుగల భేషము. వేదాంతమునకు నీర్వి - కారతయు, బుద్ధిని శేషమును నావశ్యకములు. కావ్యమున భావోద్రేకమును, చిత్తవికారములును నావశ్యకములు.


ఇఁకఁ గావ్యమునకును, 'వేదాంతమునకును నెట్టి సంబంధము? వేదాంతశాస్త్రమన నేమి? దృష్టి గోచరంబగు నీ ప్రపంచ. మునకంతయు మూలాధార మనఁదగు పరతత్త్వమును గూర్చిన విచారణయే. వేదాంతి చిత్తవిశారాది చేష్టలకు లోబడక యతీంద్రియుఁడై పరతత్త్వము నిశ్చలమగు యోగై కదృష్టితో బరిశీలించి మానవులకు వ్య క్తము గావింపఁ జూచును. కానీ, కవికి చిత్తవికారాది చేష్టలును, నింద్రియ వ్యాపారములును. గావ్యరచనకు ముఖ్య విషయము లగును. కవికీ రాగము, నభి మానము, భావోద్రేకము మొదలగు చిత్తవికారములు లేనిది కవిత ప్రభవించుటయే దుస్తరము. వేదాంతి సిద్ధాంతము మూలమునను, నిశ్చల ధ్యానము మూలమునను, జ్ఞానయోగ ముమూలమునను, సాధించు పరతత్త్వజ్ఞానము కవి భక్తివల్లను, రసముపల్లను సాధించి పరమార్థతత్త్వమును శుద్ధసిద్ధాంత