పుట:2015.372978.Andhra-Kavithva.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ.

58


కావ్యమున నీతికిఁ బ్రాధాన్యము నొప్పుకొన రైరి. జర్మన్ దేశ కవులును నీతిదక్క నన్యవిషయము లగుబాహుబలము, జాతి బలము మొదలగు నైహికవిషయములనే ప్రధానములుగఁ గొని నీతిని గనుచూపు మేర నే నిలిపి కావ్యరచనకుఁ గడంగిరి.

8. ఆధునిక విమర్శన పద్ధతి.ప్రత్యక్ష విషయపర్ణనము, '

ప్రస్తుత ఘోరసంగ్రామమునకుఁ బూర్వము కవి యున్న దున్నట్ల నీతిధర్మ సూక్ష్మములఁగూర్చి విచారణములఁ గాలము వృథపుచ్చక ప్రపంచస్థితిని, మానవజీవితమును గన్నులఁగట్టినట్ల వర్ణింపవలయు ననియు, నీతి 'కావ్యమునఁ బ్రధానాంశము గాదనియు నిశ్చయించి, ప్రత్యక్ష విషయవర్ణనము అను సంప్రదా యమును నెలకొల్పిరి. ఈ సంప్రదాయముయొక్క ఫలితము కావ్యములయందును, నాటకముల యందును, పాటల యందును, కథల యందును, నవలల యందును విశేషముగఁ గన్పట్టెడిని. ఇంతలో ఈ మహాసిద్దాంతఫలితమో యన ఘోరసంగ్రామంబు. సంప్రాప్తించె.సారస్వతము స్తంభించెను. ఈసంగ్రామ ప్రళయము నుండి యాంగ్లేయ సారస్వత మేరూపముతో బయల్వెడలునో యూహించుట పుట్టనిబిడ్డకు బేరుపెట్టఁ జూచుటయే యగు.

9. రవీంద్రునివర్గమువారిమతము, 1 1 "నీతి జావ్యమున ధ్వనిమాత్రముగ నుండును.” ,

యుద్దమునకుఁ బూర్వమే యాధునిక భారతీయకవిశిఖామణి యనందగు రవీంద్రుఁడు కావ్యము నీతి ప్రధానము గాక పోయినను నీతిబాహ్యము మాత్రము కాఁజాలదని తనకావ్య ములను నీతి ధ్వనించునట్లుగనే వ్రాసెను. వానిని జదివిన కొంత మంది యాంగ్లేయకవులును ముఖ్యముగ ఈట్స్ మొదలగు