పుట:2015.372978.Andhra-Kavithva.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

57


బ్యూపండితుఁడును, జర్తను దేశమున గీతేకవియు, నమెరికా దేశమున యమర్సన్ పండితుఁడును, సొంగ్ల దేశమున నార్నాల్డు కార్టెల్, రస్కిన్ ప్రభృతులును బ్రపంచమున ననఁగాఁ బ్రకృతిశాస్త్ర విజృంభణమునను, ధనమత్తతవలనను నీతివిదూర మయిన పాశ్చాత్య ప్రపంచమున నీతియుగమును స్థాపింపవలయు నని చాలఁ బ్రయత్నించిరి. కాని వారియత్నములు చిరస్థాయిగ నుండుఫలితమును బడయఁజూలకపోయెను.

7. స్విన్బర్ను వర్గమువారిమతము, “కావ్వము నీతిబాహ్యముగఁగూడ నుండవచ్చును.”

పై వా రంతరించినతోడనే రోజటీ, స్విక్ బరన్, స్టీవెన్ సన్, ఆస్కార్ వైల్డు మొదలగు విమర్శకులు బయలు దేరి కావ్యమునకును, నీతి కిని సంబంధమే లేదనియుఁ, గవి సర్వస్వతం త్రుఁడనియుఁ, 'గావ్యమున న న్వేషింపఁదగినది రస మే కాని నీతియు ధర్మమును "గావనియుఁ, గావ్యము రసవంతముగ నున్న చో నీతి బాహ్యముగ నున్నను దప్పులేదనియు శాసించి నిరంకుశమగు రసికమతమును స్థాపించి నీతిపథమును నడుగంటఁ దొక్కి 'ఆర్నాల్డు' ప్రభృతుల యాశయములను భగ్నములఁ గావించిరి. తత్పలితములుగ ననేకములగు మధురగీతములు వెలసినవి. కాని నీతియుత మై సర్వలక్షణశోభితములగు పెద్కావ్యములు బయలు వెడలవయ్యెను. స్విస్ బరన్ మొదలగు సాధునికాంచ్లో యకవు లెల్లరును నీతి యప్రధానముగ నున్న విషయములఁ గూర్చియే కవిత వ్రాసి కీర్తిగడించిరి. కాని, నీతి ప్రథానవిష యముగఁ గొని కావ్యరచనకుఁ గడంగ రైరి. ఫ్రాన్సు దేశము నను సౌందర్యారాధనము మెండుగఁ గవులు కావించిరి. కొని