పుట:2015.372978.Andhra-Kavithva.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

50


కావ్యమున నీతి ధ్వనిమాత్రముగ నుండును.

కావ్యము నీతిబోధకముగనేయుండవలయునను టొకటి, నీతి కావ్యమున ధ్వనించుచుండవలయునను టొకటి, కావ్వము నీతిబాహ్యముగ నుండఁదగుననుట వేరొకటి. కావ్యము నీతి బోధకముగనే యుండవలయునని శాసించుటయుఁ, గావ్యము నీతిబాహ్యముగ నుండఁదగు ననుటయు రెండును గూడని మతములు. కావ్యము నీతిబోధకముగ నుండవలయునని పలుకు వారు స్వధర్మముఁ బరిత్యజించి కవి యన్వధర్మములు స్వీకరించి దానికి దాసుఁడై పదభ్రష్టుడు గావలెనని సూచించుచున్నారు. ఇఁకఁ గావ్యము నీతి బాహ్యముగ నుండవచ్చు ననువారు మానవజాతికి ముఖ్య లక్షణమగు నీతిని సంపూర్ణముగ నాశముఁ జేసి దానిని అనఁగా మానవజాతి గౌరవమును నడుగంటల దొక్కఁ దలంచుచున్నారు. మామతమున నీతి కావ్యమున ధ్వనించుచుండవలయును. కావ్యమునకు నీతి సాధనమాత్రము గను నుపాంగముగను నుండి సర్వసంపూర్ణమగు కావ్యసౌందర్యమునకు దోహదముఁ గావింపవలయును. ఉత్తమప్రకృ తులచరిత్రములును, దుర్మార్గులలో సయితము గ్రహింపనగు సద్గుణాభివర్లనమును నీతిని సూచించుచునేయుండును. దాని వలన మానవునకు నాత్మవికాసము గలుగుచునే యుండును. అంతియేకాని 'కవి ఇది చేయుము, అది చేయకుము” అనుచు "ధార్మికుని వలెను నైతికునివలెను శాసింపఁబూనుట పిలువని పేరంటమునకుఁ జనుటంబోలిన దే. పాశ్చాత్య సాహిత్య చరిత్ర, మునఁగూడఁ దుట్టతుదకు నీనిర్ణయమే జరిగెను,