పుట:2015.372978.Andhra-Kavithva.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

49


భంశము విధించితినని తలంపకుఁడు, కావ్యమున నీవియెల్లను సాధనములుగ నుండిన నుండవచ్చును. ప్రధానవిషయమగు కావ్యసృష్టికి నిరోధము కలిగింపనంతవరకు వానికిఁ గావ్య మునఁ దావీయవచ్చును. అంతియేని వానిని గావ్యమున రసమునకు నీడువచ్చునధి కారినిగా శాస్త్రమునకుఁ దావొసంగితిమేనిఁ జనువిచ్చినఁజంకెక్కె' ననులోకసామ్యము యథార్థమై కావ్యమున రసమునకుఁ బదచ్యుతి సంభవించినను సంభవించును. కవి యనేకులగు యజమానులకు దాసు, డైనవారిలో నెవ్వరినిఁ దిన్నఁగ సేవించుటకు వీలు కలుగకపోవుటయే కాకరెంటికిం జెడిన రేవడిభంగిని ఆత్మ గౌరవమును నన్యుల యాదరణమును గోల్పోవలసిన యవస్థయు సంభవించును. తమతమ నెలవులు దప్పిన తమమిత్రులె శత్రులగుట తథ్యము అగునటుల స్వీయకృత్యమును మఱచి పిలువని పేరంటములకు బోయి యగౌరవమునందుఁ గవి రసికలో కాదరణమునకుఁ గూడఁ బాత్రుఁడును కాకపోవుట తటస్థమగును. నీతి, ధర్మము మొదలగునవి కావ్యమున ధ్వనించుచుండును. కాని ప్రధాన ప్రయోజనములు గా నేరవని నా విన్న పము, ఈయభిప్రాయ మునే మమ్మటుఁడు 'అనన్యపరతం త్రాం' అనుకావ్యవిశేషణ మున సూచించినాఁడు. కావ్యము అన్యములపై నా ధారపడి యుండదు, అసఁగా నీతి, ధర్మము మొదలగు నన్య ప్రయోజనముల సర్జింపదు. స్వతంత్రమై వానిని సాధనమాత్రములుగఁ గైకొని సేవకపడముల నియోగించు నేకాని వాని కెన్నఁడును దసతో సమానమగు గౌరవమును స్థానమును నొసంగదు. ఈ భావమునే పండిత రాయలు విశ్వనాథుఁడు మొదలగు రసిక వర్గమువారెల్లరు నంగీకరించిరి. ఆంధ్ర కవిత్వ---4