పుట:2015.372978.Andhra-Kavithva.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ

48


ధనము, శుభము, మొదలగువానికి దాసునిగఁ జేయఁదగునా? వివిధ ప్రయోజనముల సాఫల్యమునకు వివిధశాస్త్రములు నిర్దే శింపఁబడియుండఁ గవి పని లేనిపనిగ వానిపొంత నేలఁ బోవల యును? ఎవరిపని వారు చూచుకొన్నఁ దమకుసు, మిగిలినవారి కిని మేలగు కవి తనస్వధర్మమును వీడి శాస్త్రములపొంత బోయినచోఁ భారతంత్ర్యమునఁ బరాధీనతయు నేర్పడు నేకాని వేఱ ప్రయోజనసిద్ధి లభింపదు. ప్రకృతియం దెప్పుడును సనవసర వ్యయముగాని యనవసర ప్రతిభావ్యయముగాని యుండ రాదు. ప్రకృతి సహజముగ లోభిని చేతనున్న శక్తి ననవసరముగ వ్యయము చేయదు. వివిధశాస్త్ర కారులు వివిధశాస్త్రముల రచించి వివిధ మానవధర్మముల నిర్దేశించియుండుఁ గవి స్వస్ధానము వీడి తన కావ్య ప్రపంచమును వీడి తనరమణీయపథము నతిక్రమించి కార్య కారణములఁ గూర్చినయు ధర్మాధర్మములు గూర్చినట్టియు, శుభాశుభములఁగూర్చినట్టియుఁ, బుణ్యపాప ములఁగూర్చినట్టియు వివాదముల జోలి కేలరావలయును? రాఁదగదు. శాస్త్ర మెప్పుడును సమష్టి విషయకదృష్టి నే కలిగియుండును. కావ్య మెప్పుడును స్వస్వరూపసం ధానపూర్వకమగు వ్యష్టి విషయకదృష్టియే కలిగియుండును. కావున నీ రెంటికిని బ్రథాననిరీక్షణమున భేదమున్నది.

శావ్యమున నైతిక ప్రయోజనము లప్రథానములు. రసప్రవృత్తియే ప్రధానము. మమ్ముటునిమతము.

అట్లనుట చేఁ గావ్యమున నీతియుఁ బై నఁజెప్పిన ప్రయో జనములును సిద్ధింపఁదగనివని నాయభిప్రాయము గాదు. అవి ప్రధానలక్ష్యుములు గావని నంతమాత్రమున - వానికి బద.