పుట:2015.372978.Andhra-Kavithva.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

47


జూచునా? ఆట్లు చూచుట మంచిదగునా? ఈ ప్రశ్నకు సమాధానము ననేకులగు విమర్శకు లనేకరీతుల నొసఁగిరి. ఈవిషయ మునుగూర్చి ప్రాచ్యపాశ్చాత్య విమర్శనసంప్రదాయము లోకే విధమగు నవ భేదముల నొందినవి. మన దేశమునఁ గావ్యము నీతిబోధకముగ నుండవలెనని కసించిన లాక్షణికశాసనము లలో నెల్ల ను "కావ్యం యశనే౽ర్టకృతే వ్వవహారవిదే శివేతరకు తయే, సవ్యః పరనిర్వృతయే కాంతాసమితత యోప దేశయు జే" అనువాఖ్యమే ప్రమాణాధికారము నందియున్నది. ఈ వాక్యము యొక్క యర్ధముఁ బరిశీలింతు మేనిఁ గవి కావ్యము యశస్సు గొఱకును - నర్థసంపాదనముకొఱకును వ్యవహారజ్ఞానముఁ దెల్పుట కొఱకును నశుభములఁ దొలఁగించుట కొఱకును తా త్కాలికసుఖ మొడఁగూర్చుట కొఱకును భార్యయుం బోలె సమతముగ నుపదేశించుట కొజుకు నని తేలుచున్నది. కవి నిశ్చయముగ నిన్ని ప్రయోజనముల నర్థించి కావ్యము వ్రాయునా? వ్రాయఁదగునా? వ్రాయుటవల్ల నేమైన నష్టముగల్గునా? కావ్యము రసాత్మకమని యంగీకరించుటకుఁ బై శాసన మభ్యం తరము గల్గించును గావున దీనిని గొంచెము విమర్శింపక తప్పచు. యశంబనఁగ నెట్టిది? అర్థమనఁగ నెట్టిది? శుభాశుభము లెయ్యవి? వీనికిని గవికిని నేమిసంబంధము ?

శాస్త్రములు చేయుపనిని కవి చేయఁజూచుట యనవసరము.

కావ్యమునఁ గవి కల్పనఁ జేయుపొత్రలు స్వతంత్ర ప్రవృత్తింగలవిగ నుండునని యింతకుమున్నే మన " మంగీకరించి యుంటిమి, ఇప్పుడు కవిని బ్రయోజనములకు అనఁగా యశస్సు,