పుట:2015.372978.Andhra-Kavithva.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

41


విషయముల నిదమిత్థమని నిర్ణయించును. కవి సహజముగఁ బక్షపాతి, యభిమాని, చిత్తవికారములకు దాసుఁడు, పక్ష పాతము, నభిమానము, చిత్తవిశారజనితమగు వ్యామోహ మును లేనిది కవిత పుట్టుటయే యసంభవము. కావునఁ గవిత ప్రభవిల్లవ లెనన్నఁ దార్కికుని దూరముఁగ దొలఁగిపొమ్మనుట యవశ్యకరణీయము. కవిత్వ మెన్నఁడును సిద్ధాంత విషయము గాదు. చర్చవలన సత్యము నిరూపించుట 'కవకాశముగల శాస్త్రము గాదు. కవిత్వరస మనుభవైకవేద్యము గావలయుఁ గాని సిద్ధాంతములవలన నలవడదు. ఈ భావమునే భోజుని యాస్థానమున నొక కవి యీ క్రింది చాటుశ్లోకమున వర్ణిం చెను.

   శ్లో.ఆధరస్య మధురిమాణంకుచ కాఠిన్యం దృణోశ్చ లైక్ష్యం చ,
 కవితాయాః పరిపాకం హ్యనుభ వరసితో విజానాతి.

కావ్యమునకు ధర్మశాస్త్రమునకుఁ గల భేదము.

తార్కికునితోడి పోరాటము ముగిసిన తోడనే ధార్మి కునితోడి కయ్యము సంప్రాప్తమగు చున్నది. ధర్మశాస్త్రమననేమి? మానసవ్యవహారముల నుద్భవించుకలహముల సమ దృష్టితో సవలోకించి న్యాయ్యముగా తీరుమానము నిచ్చు శాస్త్ర మే ధర్మమే ప్రపంచమున నుండనిచో నిరంతరసంరంభము తప్పదు. ధర్మశాస్త్రము జీవితసమస్యను న్యాయముగఁ బరిష్కరించి జీవితమున సామరస్యముఁ గల్పింప యత్నించును, ఇవి తగునివి తగదని ధర్మశాస్త్రము విధినిషేధముల నిర్ణయించుకు. శబ్దస్వరూపము విషయమున వ్యాకరణమునకు బలె మనవారు లౌకిక వ్యవహారముల ధర్మశాస్త్రమునకు శాసనాధి కారము నొప్పికొనిరి. ధర్మశాస్త్రము మితిమీరి వర్తించువారు దండ