పుట:2015.372978.Andhra-Kavithva.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్,

37


వాటిల్లెడు తావులందక్క సర్ధానుస్వార విసర్జనము సర్వత్ర దోషముగఁ బరిగణింపఁదగదు.

2. రేఫ శకట రేఫముల ప్రశంస.

ఇంక "రేఫశకట రేఫముల విషయము: వీనికి నేమో నిసర్గ భేదమున్న దనియు, నందువలన వీనికి మైత్రి గల్పించుట మహాదోషమనియు భావించి యాంధ్ర దేశలాక్షణిక శిరోమణి యనందగు సప్పకవి పోతనామాత్యునిచే విరచితమగు శ్రీమ ద్భాగవతమును నధఃపాతాళమున నడుగంటఁడొక్కఁజూచెను. కానీ, మన యదృష్టఫలమునను, బోతన కవితా ప్రభావమునను భాగవతము నప్పకవ్యాదిలాక్షణికంమన్యుల తాఁకుడులచే సశింపక ద్విగుణీకృత వైభవముతోడను, శక్తితోడను నాంధ్రరసికులహృదయముల వశముఁ గావించుకొనుచున్నది. వైయాకరణుల చేఁ గల్పింపఁబడిన నియమములఁ గొన్నింటి మాత్రమే యుదాహరించితి.

వ్యాకరణమునకుఁ గావ్యముపయిఁ బ్రభుత్వము లేదు.

నాయభి ప్రాయ మేమనఁగా వ్యాకరణశాస్త్రము గౌరవార్హ మయ్యుం గౌవ్యనిర్మాణము నెడఁ బ్రభుతవహించు టకు సమర్థము గాదనియు, వ్యాకరణనియమములకు లోనై రసవ త్తర కావ్య కల్పనముఁ జేయఁగల్గుట ధీవైభవ ప్రదర్శక త్వమే యైనను వైకల్పికములగు వ్యాకరణ నియమములను మాత్ర మతిక్రమించి సహజములగు నియమములఁ బాటించి రసమునే ప్రధానలక్షణముగ నుంచి కవితఁ జెప్పంబూనుట యొక్కింత సాహసకృత్య మయిననుఁ భాపకార్యము మాత్రము గాదనియునే|