పుట:2015.372978.Andhra-Kavithva.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వఛరిత్రము

ప్రథమ

32


ఆంధ్ర కవిత్వఛరిత్రము బోలియుండు మహర్షులకుఁ జెల్లు నేకాని యితరులకుఁ జెల్లదు. పిశాచావేశమున మతి భ్రమనొంది ,పూర్వాపరజ్ఞానముఁ దక్కిన, వారికిఁ జెల్లిన నొక వేళఁ జెల్లవచ్చును. అంతీయకాని పంచేంద్రియ వ్యాపారములకు పశుడై సజీవుఁడై యుండు ప్రతిమానవునకు నీ కాలవి భేదవిమర్శనజ్ఞానము సహజసుభసమే.

వాడుకపదములస్వరూపము సమర్థించ్చు విపుల వ్యాకరణ మవసరము.

కావున వైయాకరణులు కావింపవలసిన దేమి? వాడుకలో సున్న శబ్దజాలమును సమగ్రముగఁ బరిశీలించి వాని తత్త్వముఁ బ్రకాశముఁ గావించుటయేకాని 'సాధుత్వాసాధుత్వారి చర్చ. యనుసాకు పెట్టి లేనిపోనినియమములఁ గల్పించి నిషేధముల వేన వేలుగఁ గావించుట గాదు. లింగ-వచన-పురుష. కాలవి భేద విషయముల సహజనియమముల మాజీచనక యితరవిషయములఁ గూడ స్వచ్చంద స్వభావ ప్రవృత్తి కేసూత్రమును నిరోధములఁ/ల్పించు కొనక సహజమధురమగు రీతినిభాషించు సామాన్య జనుల చే వ్యవ హరింపఁబడు పద రూపముల నన్నిటిని సాధువులు గఁగాని,యంత కుంజాలనిచో శుద్ధమైన రూపములకు రూపాంతరములుగఁ గాని వైయాకరణు లంగీకరించి ప్రయోగమునకు వైరశ్య మాపా దించుటయే భాషకు శ్రేయోదాయకము. అట్లు వైయాకరణులు ప్రయోగ విషయమున వైరశ్య మొప్పుకొన్న చో వ్యవహార మున నున్న పదముల రామణీయకము నశించిపోవక యెన్నియో వన్నె ల చిన్నెలతోఁ బ్రకాశించి కావ్యమునకు నిత్య నవ్యత నొడఁ గూర్పఁజూలును. అప్పుడు సొమరులయ్యు హృదయ భావోద్వేగ బలమున సామాన్యులు నైతము కవిత, జెప్పి యిన్ని శతాబ్దములు