పుట:2015.372978.Andhra-Kavithva.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రకవితచరిత్రము

ప్రథమ

18


వఱకును నావివాద ముభయకక్షలవారికిని సమ్మతమగునటుల బరిష్కరింపఁబడె ననుటకు వీలు చిక్కకున్నది.

1.ప్లేటో

పాశ్చాత్య విజ్ఞానభానుఁ డనఁదగు 'ప్లేటో' ఈ ప్రశ్నము "మొట్ట మొదటఁ గావించెను. ఆతఁడు 'అతీతసామ్రాజ్య' మను గ్రంథమునఁ 'గవికి స్థాన మొసఁగఁగూడ దని శాసించు సందర్భమున నీ క్రిందిమతమును సమర్థింపఁ జూచెను. అది యద్దియన, "*స్థూలదృష్టికి గోచరమగు నీబాహ్య ప్రపంచము భగవంతునియందు లీనమయియుండు భావ ప్రపంచమునకు ననుకరణమనియుఁ, గవిసృష్టమగు కావ్య ప్రపంచము బాహ్య ప్రపంచమున కనుకరణమనియు, నందుచేఁ గవి సత్యమునకు రెండింతలు దూరమగుచున్నా (డనియుఁ, గావునఁ గవికి అతీత సామ్రాజ్యమునఁ బ్రవేశించుట కర్హత లేదనియు విస్పష్టమగు చున్నది* . పైన చెప్పబడిన ప్లేటో పలుకుల బాహ్యప్రపంచమున కనుకరణమని తేలుచున్నది. "ప్లేటోశిష్యుఁ డగు 'అరిస్టాటిల్' అనునతఁడు గురుమతమును బరిస్పుటముగం జెప్పి యొకయలంకార శాస్త్రమునుగూడ విరచించి పాశ్చాత్యు లలో నొకలాక్షణికవర్గమువారికి మూలపురుషుఁ డయ్యెను.

2. ఆరిస్టాటిల్.

అరిస్టాటిల్ కవిత్వమునకు నిర్వచనము నిట్లు చెప్పెను. “కావ్యము ప్రకృతికి వాగ్రూపమగు ననుకరణ” మని, ఈయను కరణ 'మనుపదమునే 'ఆరిస్టాటిల్” అనేక సందర్భముల సమర్దించెను. అందుచే నీపదము కొంచె మించుమించు సూత్ర