పుట:2015.372978.Andhra-Kavithva.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


వరుస దప్పకుండ వాక్యమును రచించును. వచన రచయిత భావౌత్సుక్యమును ప్రధానముగాఁ గొనఁడు. అర్థ సందర్భమునే లక్ష్యముగా గ్రహించును. కావున పద్య రచయితకును, గద్వ రచయితకును గల భేదమును సూచించితని. ఒక్కడు సిద్ధపురు. షుఁడు; తన హస్త బలిమిని తన దివ్య ప్రజ్ఞను గుర్తింప నేరక దివ్యశక్తిచేఁ బట్టిన దెల్ల బంగారు గావింపఁగల యమేయ ప్రతిభాశాలి. వేరొకఁడు ఆలోచనా బలమును జ్ఞాన సంపత్తియును గలిగి చేజిక్కిన పరికరములతో జ్ఞాన సౌధము నిర్మింపఁజూచు వాఁడు ఒకని వాగ్దాటియు దివ్య గానమును ఆకాశగంగా ప్రవాహముయొక్క థాటిని మజపింప శక్తిఁగల్గి యుండును. వేవొకని వారణి శిష్యునికి విద్యఁగఱపు గురుని వాగ్విశేష మునుఁ బోలియుండును. ఒకని శక్తి యలౌకికము. ఇంకొకని.” శ. ! 'పౌరుషేయము. ..

పద్యమే ముందు పుట్టెననుటకుఁ గారణములు. . 1 . మానవజీవితచరిత్ర రహస్యము,

పద్య రచయితకును గద్య రచయితకును గల భేదమును! గ్రహించిన మనకుఁ బ్రపంచసాహిత్య చరిత్రము నందుఁ బద్వము, ముందు పుట్టినదా? గద్యము ముందు పుట్టినదా? అను ప్రశ్నకు సమాధానము వెంటనే స్ఫురింపఁగలదు. చరిత్రను బట్టి చూచిన మానవులు మొట్ట మొదట ఆలోచ నాబలము తక్కువ గలిగి యుండిడనియు, భావౌత్సుక్యమునే యెక్కువ గలిగి యుండి రనియుఁ దెలియు చున్నది. జాతులయొక్క పరస్పర సంఘట్టనము పలన విజ్ఞాన మభివృద్ధి నొంది, యాలోచనా శకి యతిశయించి, భావమునకు స్థానభ్రంశము సంభవించు చున్నది. పురా