పుట:2015.372978.Andhra-Kavithva.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

287


యొక్క గాత్రము విశ్వ వీణానాదములో మిళితమై మనోహర రాగాలాపమును గావించును. అట్టి మనోహర రాగాలాపన మే పద్యమగును. అట్టి రాగాలాపనము విశ్వవీణానాదమును జెవు లార విననివానికి సాధ్యము కాదు. అట్టి విశ్వవీణానాద శ్రవణము మనస్సు వికసించిన యనంతరము గాని కవికి లబ్దము కాదు. అట్టి మనోవికాసము కవియొక్క మనోనైర్మల్యము ననుసరించి యుండును. కావున పద్యరచనను బ్రేరేపునది భావౌత్సుక్యమును విశ్వవీణానాద శ్రవణమును, మనోనైర్మల్యమును నని యెఱుంగునది. వచన మన్ననో యట్లు గాదు. వచన మెంత వరకును వ్యాకరణ జ్ఞానమును, ఆలోచనను, పద ప్రయోజనమును, పూర్వోత్తర సందర్భమును,తర్కమును నా ధారము జేసికొనును. ఇందులకు పద్యము యొక్క గతికిని, వచనము యొక్క గతికినిగల భేదమే తార్కాణము, పద్యము భావము యొక్క గతి ననుస రించునది యగుట చే పదములు కర్తృకర్మ, క్రియల వరుసల దప్ప కుండునట్లుగ రావు. భావోత్సుకతనలన నేపదము ముందు దట్టిన నాపదమే, అయ్యది కర్తయైనను సరే, కర్మయైనను సరే, క్రియ యైనను సరే, విశేషణమైనను సరే, కడకు ప్రత్యయమైనను సరే ఆపదమే ముందు ప్రయోగింపఁబడును. ప్రయోగింప బడు నను మాటయే తప్పు. నిజముగఁ బ్రయోగించువాఁ డొక్కడున్నాఁడా? ఛాయాగ్రహణ యంత్రమున నద్దముపై మానవుని ప్రతిబింబ మెట్లు దిగునో అట్లే ఆపదము తనంత తానే దిగును. వచనమున నట్లు గాదు. వచన రచయిత పూర్వోత్తర సందర్భములఁ జక్కఁగ విమర్శించి యాలోచనా బలమున నే మాట ముందు రాఁదగునో, యేమాట వెనుక రాఁదగునో విచారించి వ్యాకరణ నియమములు దప్పకుండ,కర్తృకర్మ క్రియల