పుట:2015.372978.Andhra-Kavithva.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

ఆంధ్ర కవిత్వచరిత్రము

286


వశముఁగొని యుఱూత లూఁగించునపుడు ఆతఁడు పద్యరూప మునఁ బలువరించునో? గద్యరూపమున విచారణసేయునో? అని తర్కింపంచరు. కవియొక్క స్వభావము కల్మషర హితమును నిష్కపటమును నగుట చే శిశుస్వభావమును బోలినదై యుండును. సహజకవి యందు శిశులక్షణము లెన్నేనియుఁ గాననగును. శిశువు అద్భుతమగు విషయము నేదేని గాంచినతోడనే కెవ్వున కేక వేయును; కలకలనవ్వును; కొండొకయెడ వలవల నేడ్చును. కవియు నట్లే కొన్ని యెడల ఆశ్చర్యవిభ్రమాన్వితుఁడై హాహా కారము సలుపును. కొండొకయెడ మందహాసముఁ గావించును. ఇంక నొకప్పుడు విచారపూరిత హృదయుఁడై కస్నుల నీరునించి పలవించును. కవిమనము నావహించుకోన్న ఆశ్చర్య భావము యొక్క ప్రస్తార భేదములు పద్యమున వ్య క్తమగునంత స్ఫుట ముగ గద్యమున వ్య క్తములు గావు,

పద్యగద్యరచనలయందుఁ గల భేదము.-

ఇందులకుఁ గారణము విచారింతము. పద్యరచనను ప్రేరేపించునది యొక దివ్య శక్తియని యెఱుంగునది. అది సామాన్యబు కతీత మైనది. ఆలోచన కందనివీ, తర్కమునకు లొంగనిది, మీమాంసచేఁ దేలనిది, శాస్త్ర శృంఖలలచేఁ గట్టు పడనిది, అయ్యది యొక యలౌకిక ప్రతిభ. ఇట్టి, యలౌకిక ప్రతిభ గల కవియొక్క మనస్సు వెన్నవోలె మెత్తనిదియు, శిశువు యొక్క మనస్సువోలె నిష్కల్మషమును నగుటచే విషయమును జూచు తోడనే వేఁడి తాఁకిడిని గరంగిపోవు వెన్నవోలె గరంగి శిశువు యొక్క మనస్సువోలె, అద్భుతాశ్చర్యములచే కల్లోలిత మగును. తోడనే కవికి మనస్సు వికసించును. కవి