పుట:2015.372978.Andhra-Kavithva.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావ ప్రకటనము.

281


భావము లనంతములగుట చే రసము లనంతములనియు, భావము యొక్క స్వరూపములగు శైలు లనంతములనియు, భావము యొక్క నాదరూపమగు పద్యరీతి శావ్యమునకు ముఖ్య మనియు, నట్టి పద్య రీతు లనంతము లనియును గ్రంథవిస్తర భీతి చే సుదాహరణముల మెండుగ నీయనందులకు పాఠకులు మన్నించి యాలోపమును దామే సపరించుకొందురుగాక.

- పద్యము ముందా? గద్యము ముందా? -

పద్యము ముందా? గద్యము ముందా? అను విషయమును విచారించి నిర్ధారించుటకు ముందు పద్యరచనకును గద్యరచన కును బ్రేరకములగు మానవస్వభావ విలక్షణములను పరిశీలింప వలయును. పద్యరచనను బ్రేరేపించునది భావౌత్సుక్య మనియే యిదివఱకు నిరూపించి యుంటిమి. భౌభౌత్సుక్యము గలవారు 'కామార్తులఁ బోలి ప్రకృతికృపణు లగుట చే దీర్ఘ విచారములఁ బొద్దుపుచ్చక, మీమాంసల పొంతఁ బోళ, దుర్గమతర్క సిద్ధాంత మహారణ్య ప్ర దేశంబులఁ జొజక, పౌర్వా పర్యముల విచారింపక కొండోకయెడఁ జేతనా చేతననిషయజ్ఞానశూన్యు లగుచుఁ గూడ నోటికి వచ్చినయట్లు, బుద్ధికి దోఁచినట్లు, కలము పోవునటులఁ బద్యము లల్లుచుఁ దమ హృదయ తాపమును శమింపఁ జేసికొందురు. కవికి జనాంతర సంస్కారము ముఖ్యమని గత ప్రకరణముల విన్నవించి యుంటిమి. అట్టి ప్రాక్తన సంచిత కవిత్వశక్తిగల కవి ప్రకృతిని జూచిన నొక నిముసమేనియు సూరక యుండఁలఁడు. ఏదేని యొక విషయముపై నాతని మనసు తగులకపోదు. అట్లు మనసు దగిలిన విషయము నాతఁడు ముందు పద్యమున వర్ణించునా? లేక గద్యమున వర్ణిం