పుట:2015.372978.Andhra-Kavithva.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పకరణము.

భావ ప్రకటనము.

277


అట్లయ్యుఁ బద్య ఛందమునకును ప్రకృతి ఛందస్సు నాధారముఁ జేసికొన్న గద్య ఛందమునకును నిసర్గమగు భేదము కలదనియు, గద్య ఛందమున వ్రాయునతఁడు. పద్య ఛందము వ్రాయఁబోయి రెంటికిం జెడినవాఁ డగుననియు వాదించినాఁడు వాట్సుడంటను పండితుఁడు.

కాని, ప్రపంచసౌహిత్యమును విచారించితి మేని ఎల్ల దేశములను పద్యము ముందు పుట్టి గద్యము తరువాతఁ బుట్టి నట్లు స్పష్టమగు చున్నది. హృదయభావము నిశితముగ నున్న పుడు ఆక్రందనమునకు నీడువచ్చు పచ్యమే మొదట వెలుపడు ననియుఁ, బిమ్మట నాలోచన ముదిరిన తరువాత గద్యము వెలువడుననియు సర్వసాహత్యముల చరిత్రములును వ్యక్తముఁ జేయుచున్నవి. ఈభావమునే వాట్పుడంటన్ పండితుఁడు జన్మతః కవియగు వానికి సొదరూప నాదభరితమగు Emphasis of Sound) పద్యమే ముందు స్పురించుననియు, సట్లు కానియతనికి అర్థభారయుతమగు(Emphasis of sense)గద్య మే స్ఫురించు ననియుఁ గవియైన వాడెప్పుడును పద్యముననే వ్రాయు ననియుఁ జెప్పినాఁడు. ప్రపంచమున ఛందస్సు లేకుండ కావ్య ముల వ్రాసినవా రెవ్వరును నింతవరకు లేరు. ఆ మెరికా దేశ స్థుఁడగు పొట్టువిటన్ (Walt Whitman) అనునతఁడుమాత్ర, మీందులకు మినహాయింపు, గద్యరచయితలను కవులని పిలుచుట యాదరభావముననేగాని, సత్యము విచారించి యట్లు పిలుచుట దగునని నమ్ముటవలనఁ గాదు. గద్యము గద్యమే, పద్యము పద్య మే, దీని సొంపు దానిదే, దేని గౌరవము దానిదే. ఒక దానిలో నొకదాని నిరికించుట పొసఁగని మతము.