పుట:2015.372978.Andhra-Kavithva.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

267


ఆత్త, మొదలగు వానిని, వానివానియొక్క శక్తిని, అధికార మును ననుసరించి రంజింపఁజేయుననియు, నట్టికావ్యానంద పరిణామముల ననుసరించి శైలియు చతుర్విధములుగ నుండి కావ్యమును బోషింపుచు శబ్దసిద్దిగఁ బరిణమించుననియు, నట్టి కావ్య శైలి తుష్టిఁ గూర్చునదియుఁ, బుష్టిఁ గూర్చునదియుఁ, గాంతి గూర్చు నదియు, బ్రహ్మానందముఁ గూర్చునదియు నను నాలుగు తరగతులుగ ప్రయుక్తమగు చుండుననియుఁ దెల్పి శైలివిషయ మున తుష్టి, పుష్టి, కాంతి, బ్రహ్మానందము లనుపదముల కర్ణ మేమో సోదాహరణముగఁ జర్చించియున్నాడు. ఆభావములను నాంధ్ర పద్యోదాహరణములతోడ వివరించెదను.

శైలితుష్టి" యనఁగా అర్థమునకు మాటకును గల సాధారణమైత్రి యే. ఇందు విషయసాక్షాత్కారముగాని, పద సాక్షాత్కారముగాని యుండక, పదములకును నర్ణములకును పచనమునఁబలె సామాన్య మైత్రి మాత్రమేయుండి విశేషోత్తేజకమగు ప్రభావమేమియు లేకుండును. ఇయ్యది బుద్ధినిమాత్ర, మే రంజించును. ఉదాహరణము.

 కోపము సుబ్బును గర్వము
నాపోవని యునికియును దురభిమానంబును ని
ర్వ్యాపారాత్వము ననునివి
కాపురుషగుణంబు లండు కౌరవనాథా! (భారతము)

క. కరయుగములు చరణంబులు
నురము లలాటస్థలంబు నున్న తభుజముల్
సరిధరణి 'మోపి మొక్కినం
బరువడి సాష్టాంగమండ్రు, బరమమునీంద్రుల్',