పుట:2015.372978.Andhra-Kavithva.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


దేవ! సోకింక నెపుడు నీదివ్యదర్శ నమ్ము
నిచ్చెదు? నాపాట కంత మెపుడు?

ఇచట భావ మేమన, భక్తుఁడు వీణ వాయించి వాయించి గొంతు బొంగురుపోవునట్లు పాడిపాడి, భగవంతుఁడు ప్రత్వ క్షము గామికి వగచుచున్నాఁడు. ధ్వనితమగు వేరొక భావము భక్తుని హృదయము భగవంతుని దర్శనమునకై తపించి తపించి, ప్రార్ధన గావించి కౌవించి, భగవద్దర్శనమును బొందఁజాలక పోవుటయే. వాచ్యమగు భావము పాటకుఁడును, వైణికుఁడును నగు భక్తునికి స్థూలముగ పర్తించును. వ్యంగ్యముగ ధ్వనించు భావము పాట తోడను, వీణె తోడను సంబంధము లేని భక్తుని హృదయార్తికి సూక్ష్మముగ వర్తించును.

ఇట్టి త్రివిధమగు ధ్వనియే 'కావ్యమునకుఁ బ్రాణమని మన లాక్షణికులలో రసిక వర్గమువా రంగీకరించిరి. ధ్వనియొక్క ప్రాధాన్యమును మనవారిలో మొట్ట మొదట నుద్దేషించినది “ధ్వన్యాలోకన" కర్తయగు నానందవర్ధనుఁడను రాజరసికుఁడే తరువాత నెల్లరు నతని వాక్యములఁ బ్రమాణములుగ నంగీక రించిరి. పాశ్చాత్యులలోఁగూడ Suggestion ధ్వన్ని ప్రధానమని మ్యాలర్మే, పోల్ వెర్లెయిన్ మొదలగు రసజ్ఞు లొప్పికొనిరి. కవులును ధ్వనిని మిక్కిలిగ పాటించియే యున్నారు.

శైలిగుణములు. అరవిందుని మతము... తుష్టి,

అరవిందయోగి కావ్య మాధ్యాత్మికశక్తి ప్రదర్శక మనియుఁ గావ్యానందము బ్రహ్మానందమే యనియు, నట్టి బ్రహానంద మలవడుటకు పూర్వము కావ్యము వివిధ పరిణామముల నందు ననియు, నట్టి కావ్య పరిణామములు బుద్ధి, అంతగకరణ, చిత్తము,