పుట:2015.372978.Andhra-Kavithva.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట

తయుఁ, బ్రతిభాశూన్యతయు, భావశూన్యతయుమాత్రమే. ఇట్టివారినే కాళిదాసమహాకవి పరప్రత్యయ నేయబుద్ధులని నిరసించెను.

-అనుకరణ మాత్మహత్యయే యగును.

-

అనుకరణ మాత్మహత్య యనఁదగునని యాంగ్లేయులు 'పల్కుదురు. “Imitation is Suicide." ఇం దెంత సత్య మున్నది? -సంపృతిభ శూన్యమగుటయు, పరుని ప్రతిభ లబ్దము గాకుండు -టయుఁ దక్క శైలివిషయమున నితరుల ననుకరించుట వలన నన్య ప్రయోజనములు సిద్ధింపవు, ఆత్మ ప్రతిభను మనము చేతు లారఁ జంపికొనుచు నితరుల సనుకరించుచుందుము గనుకనే యనుకరణ మాత్మహత్య యగునని చెప్పుట, కావునఁ బ్రతిభాశాలురు పరుల నసుకరించుటలో తమ శక్తిని ప్రతిభను నాశనముఁ గావించికొని “అనుకరణ మాత్మహత్య యే) “మూఢఃపర . ప్రత్యయ నేయబు:” అనువచనములకు లక్ష్యములు కాకుండు టకుఁ బ్రార్థించెదను.

ఉదాహరణములు.


శైలి మానవస్వభావ సూచక మనుట కుడాహరణములఁ గోరుట, ముం జేతి కంకణముఁ జూచుట కద్దము కావలెనని కోరుట వంటిదియే యగును. ఇట్టి శుద్ధసత్యమున కుదాహరణము లనవసరములు. ఏదీ, తిక్కన వర్ణించినట్లు యుద్ధమును శౌర్య ' వీర్య గాంభీర్యా దిరసముల వర్ణించిన యాంధ్ర కవి నింకొక్కని ' జూపుడు. ఏకీ, భవభూతి వర్ణించినట్లు కరుణరసము వర్ణించిన కవిని వేవొకనిని జూపుఁడు. శౌర్య రాశియై, మనుమసిద్ధి నృపొ లుని మం త్రియై, వీరా గ్రేసరుఁడై ఖడ్గతిక్కన మహాయోధునకు