పుట:2015.372978.Andhra-Kavithva.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

250

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట.

సంపూర్ణముగఁ బోలియుంట యసంభవమనియు, 'నేభావము యొక్క ప్రత్యేకస్వరూప మాభావమునకే చెల్లుచు నాభావ మునే సూచించునుగాని, వేఱుభావములకు వర్తించి వేఱు భాపముల సూచింపదు. అట్లే ఒకమనుష్యుని చిత్తవృత్తి. యింకోకని చిత్తవృత్తిని సంపూర్ణముగఁ బోలియుండదు. ఏమ నుష్యు నిచిత్తవృత్తియు స్వభావమును నా మసుష్యునకే ప్రత్యేకముగ వర్తించుచు నితరులకుఁ జెల్లకయుండును. చిత్తవృత్తు, లును, స్వభావమును నొకమ నుష్యునకును వేవొకమనుష్యు నకును గల భేదమును సూచించును. ఏమనుష్యుని యొక్క స్వభావ మామనుష్యు నియొక్క విలక్షుణత్వమును ప్రత్యేక వ్యక్తిని సూచించును.

ఇక శైలి స్వభావము నెట్లు సూచించు సందురా,, సమాధానముఁ జె ప్పెదను, భావములయొక్క సముదాయమే స్వభావ మగును. ఏల ననఁగా భావములు చిత్తవృత్తుల నాశ్రయించుకొని యుండునని మన మిదివట కేజింగితిమిగనుక ఒక్కొకమనుష్యుఁడు వెలివుచ్చు భావములనుబట్టియే యాతని, స్వభావమును గుర్తెఱుంగవచ్చును.

ముఖపరీక్షా శాస్త్రము (Physiogromy)

-

ముఖలక్షణముఁబట్టి సాధారణముగ మనుజునియొక్క స్వభావము నూహింపఁజూచుట' మానవసహజమే. ఎప్పుడును మొగము ముడుచుకొనియుండువానిని జూచిన నతఁడు గోష స్వభావముఁ గలవాఁడని మన మూహింతుము. ఎప్పుడును కల కలలాడు నగు మొగముఁ గలవానిని జూచిన నతఁడు సంతుష్టు స్వభావము గలవాడును,మంచి వాఁడును నానంద మయుఁడును