పుట:2015.372978.Andhra-Kavithva.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావ ప్రకటనము,

249

మాట. ఇంక భావములు బాగుగ లేవు కానీ, శైలి మాత్రము చాలబాగుగ నున్నదని యనుదాని భావమును నిట్లే. భావములు బాగుగ నుండక శైలిబాగుగ నున్న దనుమాటలవలన అర్థమున కును పదములకు మైత్రి లేదనియైన చెప్పవలెను; లేక యర్థము తెలియకుండ కవి పదములను పిచ్చిపిచ్చిగా వాడినాఁడనియైనం జెప్పవలెను.ఇట్లే నను భావ మనుభూతము రాలేదనియుఁ,గవి గుడ్డి వానివలెఁ గన్నులుగల ప్రయోజనము ననుభవింపనివాఁడై, పిచ్చివాని రీతి నసంబద్ధ ప్రలాపములను జేయుచున్నాఁడనియు సిద్ధాంతముఁ జేయవచ్చును. ఈభావమునే పాశ్చాత్య లాక్షణి కులు “There is nothing like a good style or fad style but there is only style." అనుపలుకుల వివరించియున్నారు.

-శైలి కవిస్వభావసూచకము. -

భావములు మానవుని చిత్తవృత్తుల నాశ్రయించి కొని వానీ ననుసరించి వర్తించుచుండునని భాసముల గూర్చి ప్రశంసఁ జేసినపుడు దెలిసికొంటిమి, మానవుని యొక్క అనఁగా కవి యొక్క, చిత్తవృత్తి ప్రకారము భావములు జనించుచుండు నని యు, నట్టి చిత్తన్నత్తి మాఱిన భావములును వేఱురూపముఁ దాల్చుననియునిదివజకే తెలిసికొంటిమి. ఒక్కొక్క కవియొక్క చిత్తవృత్తి యొక్కొకతీఱున నుండును. అందువలన నొక్కొక కవియొక్క భావము లొక్కొకరూపముఁ గలవిగ నుండును. మానవుని చిత్తవృత్తులు శరీరస్థితుల ననుసరించి యనేకవిధము లుగ నుండుననియు, నందువలన భావము లనంతవిధము లైన వనియుఁగూడ నెజింగితిమి, అట్టిభావములలో నొకదాని నొకటి