పుట:2015.372978.Andhra-Kavithva.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట

భావమునకు బ్రత్యేకస్వరూప మనందగు ప్రత్యేక శైలిని అనఁగా ప్రత్యేక పదజాలమును గుర్తింప లేకపోవుట. కావున భావములును శైలియు నేకవస్తువే, రెండు కావు. ఏభావమున శాశైలియేగాని ఒక భావమునకే రెండు శైలు లుండవు. శైలి మారనపుడెల్ల భావములు మారుచు నేయుండుననియు, ఒకని శైలిని మార్చి మనము వేఱు శైలిలో నతని భావమును జెప్పఁ జూచుట యసంభవమగు మాటయనియు మనపండితులు గ్రహించిన పరుల గ్రంథములలోని పదముల నిచ్చవచ్చినట్లు దిద్దుచు, వాని యర్థమును జెడఁగొట్టుచు, సొంత 'కపిత్తము'ల నందు దూర్చుచు, “అహోమూలచ్చేదీ తప పొండిత్య ప్రకర్ష?' అనుమాటలకు లక్ష్యమగుటకో యన్నట్లు మూలము యొక్క యర్థమును భ్రం శముఁ జేయుచుఁ, దమయొక్క తెలివిమాలినతనమును భాషా రహస్య జ్ఞానముయొక్క లేమియు వెల్ల డింపకుందురుగాక. -

ఈలోపమే యచ్చటచ్చటఁ గొన్ని విమర్శనములసైతము గానవచ్చుచున్న ది.“ఈ గ్రంథమున భావములు బాగుగ నున్నవి. శైలి మాత్రము బాగుగ లేదు. ఇది మంచి శైలి, ఇది చెడ్డ శైలి” యను విమర్శనారత్నముల నప్పుడప్పుడు మనము తిలకించుచునే యున్నాము. భావములు బాగుగనున్న నాభావముల సంజ్ఞా రూపకమగు శైలి (పదజాలము) ఎట్లు బాగుండదు? శైలి బాగుగ లేకున్న భావముమాత్ర, మెట్లు బాగుండఁగలదు? ప్రతిపదమును నర్థమునే సూచించు నప్పుడు పదజాలము బాగుండనిచో నర్థమును బాగుండదు కదా? అట్లే భావము బాగుగ ననుభూతమైనచో దానియొక్క ప్రత్యేక సంజ్ఞా రూపక మగు శైలీయు బాగుండియే తీరునుగదా! కావున నిట శైలి బాగుగ లేదన్న భావములు బాగుగ ననుభూతము కాలేదన్న'