పుట:2015.372978.Andhra-Kavithva.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

ఆంధ్ర కవిత్వ చరిత్రము

పంచమ


కావున నాటకరచనకు సంబంధించిన భావనాశక్తి కొందొకయెడలఁ గవియొక్క భావమునకును, జిత్తవృత్తికిని అంద "రానిదై సాక్షాత్ పరకాయ ప్రవేశ ప్రభావమువలననే వర్ణింపఁ దగినదై యుండునని తిరిగి విన్నవించుట. మిగిలిన కావ్యము లలోఁ గవి తన చిత్తవృత్తికిని స్వభావమునకును ననుకూలము లగు భావముల నే వర్ణించుచు నొక్కొక్కప్పుడు భావనాబల మునఁ బాత్రములయొక్క స్వభావమును దన మనస్సున కంది నంతవరకు వర్ణించును.

-రూపకల్పన విషయము. కేవలకల్పనము సాధ్యమా?

ఇచ్చట రూపకల్పనవిషయమయి రెండుమాటలఁ జెప్పెదను. కొందఱు కవులు అసహజములును, బ్రపంచసామాన్య ములుగానివియు నగు మూర్తులను వర్ణించి యున్నారు. ఉదా హరణము - పదితలల రావణుఁడు, యోజనాయతములగు బాహువులు గల కబంధుఁడును మొదలగు రూపములు: ఇవి పాక్షార్దృష్టములా? సర్వస్వతంత్ర భావనాశక్తి ప్రదర్శకములా? లేక యూహా మాత్ర కల్పితములా? అను ప్రశ్నములకు సమా ధానము విచారింతము. ఇయ్యవి యూహామాత్ర జనితము లే యని పాశ్చాత్యశాస్త్రజ్ఞుల యభి ప్రాయము.

పాశ్చాత్య శాస్త్రజ్ఞులవాదము.

There is nothing like pure imagination. Ac object of pure imagination is a myth" అని పాశ్చాత్యమనశ్శాస్త్రజ్ఞులలోఁ గొందఱు వాదించుచున్నారు. కేవలకల్పనమనునది యబద్ద మనియుఁ, బుక్కిటి పురాణమనియ్యు బై వాక్యముల యర్థము. అనఁగాఁ గవికల్పితమూర్తులన్నియు నెంతవిపరీతములుగ నున్న