పుట:2015.372978.Andhra-Kavithva.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచమ



 "Not easily jealous, but being wrought
And perplexed in the extreme."

“సాధారణముగ నీర్ష్యాగ్రస్తుఁడను గాకుండినను, వారును వీరును సూరిపోసి చెప్పుటచే, మనసు పూర్తిగవికలము నొందినవాఁడనై యిట్టిపనిఁ గావించితి”నని చెప్పెను. పై మాట లలోని “wrought" అనుశబ్దము షేక్స్పియరునకే తట్టఁదగినది. ఆమాటలోని కఱకుఁదనము వాగతీతము, అనుభవైక వేద్య మే.

"Tha marvellous timber of the word wrought"

"అని పాట్పుడంటను గావించిన వ్యాఖ్యాన మెంతయు నుచితమును సత్యమును భావప్ర కాశకము నై యున్నది. ఒక్క మాటలో నొతెల్లోహృదయమును ఱంపపుకోఁతఁ గోయుచున్న విచారముల శౌర్యమును, కఱకుఁదనమును, నొతెల్లో యొక్క దుర్బర వేదనయు, మరణావస్థయు, యాగో యొక్క దుశ్చరి తమును, డెస్టిమోనా పొందిన దుర్మరణము యొక్క భయంకర త్వమును, నొతెల్లో గావించిన క్రౌర్యముయొక్క యస్యాయ మును, నతనికి రానున్న పాటును, వాగతీతములగు నితరభావ ములను సర్వము ననిర్వాచ్యమగు రీతిని సూచింపఁగలిగినాఁడు. ఆహా! శబ్దసిద్ధియన నిట్లేకదా యుండఁదగును?

3 షేక్స్పియరు కృత మెక్బెత్ నాటకము.

మెక్బెత్ అను నాటకమున నొకసందర్భమున నిట్టియద్బుతపరశాయ ప్రవేశ శక్తి ప్రదర్శిత మగుచున్న దని కొందఱు విను ర్శకులు తలంచిన దానిని డంట పండితుఁడు పూర్వపడముఁ జేసెను. మెక్బెత్ అనునతఁడు రాజ్య కాంతూ పరుఁడై తన్ను'c బోషించు తండ్రివోలెఁ దనకు నండయైయుండిన డంక" అను