పుట:2015.372978.Andhra-Kavithva.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావములు భావనాశక్తి.

231


లేక కుతంత్రముఁ బన్ని డెస్టిమోనాతోడ కాసీయో యను సుద్యోగియుని నేదో తనయుద్యోగమును గూర్చి ప్రసంగింప నియమించి యొతెల్లోను బిలిచి కొనివచ్చి యాసంభాషణము నందలి డెస్టిమోనావాక్యముల కెల్ల సపొర్ణములఁగల్పించి డెస్టి 'మోనాకును శాసియో కును రహస్యసంబంధ ముండెననియు చెప్పి, పిమ్మటఁ దన భార్య ద్వారా యొతేల్లో డెస్ట్ మోనాకు భ్రమసూచకముగా నొసంగిన చేతిరుమాలును రహస్యముగ దొంగిలించి దానిని కౌసియో కోటు జేబులో నతనికిఁ దెలియ కుండఁ బెట్టించి, ఆ రుమాలు కాసీయోకు డెస్టిమోనా యిచ్చె ననియు, నయ్యది కాసియోకోటు జేబులో నుండుననియు నొతెలోకుఁ జెప్పెను. ఒతెల్లో యీర్ష్యాగ్రస్తుఁడై రాసియోను జంపి, యాతని జేబులో నున్న రుమాలును సంగ్రహించి, పిదప నిజ మందిరమున కేఁగి భార్యను తిట్టి, యవమానించి, ఘోరముగ తలదిండులతోఁ జావమోది చంపెను. పిమట నీసమాచారము రాజునకుఁ దెలియఁగా నతఁడొ తెల్లోను బట్టుకొనుటకై భటు లను బంపెను. వారు వచ్చులోపల నయాగో భార్యవలన నయో గోదు స్తంత్రము సర్వమును నెఱింగి, నిష్కారణముగ నిర్ధ్యా విశాచగ్రస్తుఁడై పవిత్ర శీలయగు భార్యాతిలకమును, నేపాప 'మెఱుంగని కాసియోను జంపి నందులకును, తనకో జూకై యయా గోచేతిలో దుర్తరణము నొందిన యయోగో భార్య మృతికిని, విభిన్న హృదయుఁడై బిట్టువగచి కడకు పొయమున నాత్మహత్యం గావించికొని తన మనోవేదనను, దుర్బరజీవయాత్రను నంత . మొందించెను. అతఁడు పొడుచుకొని 'చచ్చుటకుఁ బూర్వము చెప్పినపల్కులలోఁ వీనిని బరికింపుడు....