పుట:2015.372978.Andhra-Kavithva.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

పంచము

208


స్వభావమునుగూర్చి శ్రీ కట్టమంచి రామలింగా రెడ్డి గారు తమ. కవిత్వతత్త్వవిచారమున బహువిపులముగను, చక్కఁగను మన.. సున "కెక్కునట్లుగను వ్రాసినారు. వారు సర్వతోముఖముగను సోదాహరణముగను జర్చించిన విషయమును మితముగ సూ చించి విడిచెదను.

"భాపనాశక్తి యనఁగా విషయముల మనసులోఁ బ్రతి బింబించునట్లు చేయు సామర్థ్యము. ఒక్క ప్రతిబింబించుట యన నేల? ప్రత్యక్షముగ నవతార మెత్తునట్లు చేయుట, చూడుఁడు. సీత, ద్రౌపది, సావిత్రి, దమయంతి "మొదలగు. స్త్రీలు కవికల్పనలకుం జేరినవారయ్యును మనకుఁ జరిత్రముల లోని స్త్రీలకంటెను మఱియు మనము నిత్యమును జూచుచు, వాదాడుచునున్న యిరుగుపొరుగు భాగ్యశాలినులకన్న ను నెన్ని యోమడుంగులు సత్త్వముం దాల్చినవాడై స్ఫురించు చున్నారుగదా! చూడంబోయిన పాండవులు, దుర్యోధనా దులు, రామభరతులు మొదలగు మనస్సృష్టిమానవులు మిథ్యలా, మనమె మిథ్యలా? ఈ తీరున కృత్రిమములపై తము మూర్తీభవింపఁ జేయువారే మహాకవులు" అని వ్రాసియున్నారు. -

భావనాశక్తి భగవద్ద త్తమే కాని వేఱుకాదు.

భావనాశ క్తి భావములను ప్రతిబింబించునట్లు చేయవలె సన్నను, వానిని ప్రత్యక్షముగ నవతార మెత్తునట్లు చేయవలె నన్నసు కవి యాభావములఁ బూర్లముగ ననుభవించి వాని . యొక్క మూర్తులను, ప్రతిబింబములను మనోదృష్టి చేఁ గాంచి యుండవలెను. అట్టి మనోదృష్టిచే విషయముల ప్రతిబింబములను, భావముల మూర్తులను గాంచని కవి యితరులకు వానిని: